'ఛావా' డైరెక్టర్‌ నెక్ట్స్‌ బయోపిక్‌ ఈమెదే..!

వితాబాయి గురించి కథలు కథలుగా మహారాష్ట్ర చుట్టు పక్కల ప్రాంతాల్లో చెప్పుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఆమె జీవితంలో అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది.;

Update: 2025-10-22 20:30 GMT

ఛావా సినిమాతో సెన్షేషనల్‌ విజయాన్ని సొంతం చేసుకున్న దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్‌ తన తదుపరి సినిమాకి ఏర్పాట్లు ముమ్మరం చేశాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ను పూర్తి చేశాడని సమాచారం అందుతోంది. ఈ మధ్య కాలంలో బయోపిక్స్‌కి మంచి స్పందన లభిస్తుంది. కనుక లక్ష్మణ్‌ ఉటేకర్‌ మరో బయోపిక్‌ను తీసేందుకు రెడీ అయ్యాడు. ఛావా సినిమాలో శంభాజీ మహారాజ్‌ జీవిత చరిత్రను చూపించిన దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌ తన తదుపరి సినిమాలో ఒక ఫోక్‌ డాన్సర్‌ జీవిత చరిత్రను చూపించేందుకు రెడీ అవుతున్నాడని ముంబై వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇప్పటికే ఆ డాన్సర్ పాత్ర కోసం నటిని సైతం ఎంపిక చేశాడని, అతి త్వరలోనే సినిమాను అధికారికంగా ప్రకటించి, సినిమా షూటింగ్‌ను ప్రారంభించి వచ్చే ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా దర్శకుడు ప్లాన్‌ చేశాడని తెలుస్తోంది.

 

వితాబాయి భౌ మాంగ్‌ జీవిత చరిత్ర

మహారాష్ట్రకు చెందిన ఫోక్‌ డాన్సర్‌ వితాబాయి భౌ మాంగ్ నారాయణంగావ్కర్ జీవితం గురించి చాలా మందికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ సినిమాను మొదలు పెడుతున్నట్లు దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌ చెబుతున్నాడు. ఈ పాత్రకు గాను ఇప్పటికే ఆయన స్త్రీ 2తో సూపర్‌ హిట్‌ను సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ శ్రద్దా కపూర్‌ను ఎంపిక చేశాడని తెలుస్తోంది. ఆ పాత్ర కోసం శ్రద్దా కపూర్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ వర్క్ మొదలు పెట్టిందని తెలుస్తోంది. వితాబాయి గురించిన వివరాలను తెలుసుకోవడంతో పాటు, ఆమె డాన్స్‌ గురించి, అప్పటి సంగీతం గురించి వర్క్‌ షాప్ నడుస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. మొత్తానికి వితాబాయి యొక్క జీవిత చరిత్రను ఆసక్తికరంగా వెండి తెరపై చూపించేందుకు గాను దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌ రెడీ అయ్యాడు. శ్రద్దా కపూర్‌ ఎంపిక విషయంలో కొందరి నుంచి వ్యతిరేకత వస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

శ్రద్దా కపూర్‌ హీరోయిన్‌గా..

వితాబాయి గురించి కథలు కథలుగా మహారాష్ట్ర చుట్టు పక్కల ప్రాంతాల్లో చెప్పుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఆమె జీవితంలో అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంది. పురుషాధిక్య సమాజంలో ఆమె నిలదొక్కుకునేందుకు చాలా కష్టాలను ఎదుర్కొన్నట్లు గా చెబుతారు. ఆమె ఒక కార్యక్రమంలో ప్రదర్శన ఇచ్చేందుకు వెళ్లిన స మయంలో 9 నెలల గర్భవతి. నిండు గర్భిణిగా ఉన్నప్పటికీ ప్రదర్శణ ఇచ్చేందుకు సిద్ధం అయింది. అయితే మరికాసేపట్లో కార్యక్రమం ప్రారంభం కానున్న సమయంలో ఆమె ప్రసవించింది. స్టేజ్ వెనుక బిడ్డను ప్రసవించింది. బొడ్డు తాడును కట్‌ చేసేందుకు ఎలాంటి పరికరాలు లేకపోవడంతో రాయితో కోసం మరీ బిడ్డ పేగును తెంచిందని అంటారు. ప్రసవించిన వెంటనే ప్రదర్శన చేసింది. ప్రదర్శణ సమయంలో బేబీ బంప్‌ లేకపోవడంతో చాలా మంది ఆశ్చర్యపోరారు. ఆ తర్వాత విషయం తెలుసుకుని కార్యక్రమాన్ని ఆపేశారు.

ఛావా దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వంలో

ఆ ఘటన వితాబాయి గొప్పతనం ను, ఆమెకు కళ పట్ల ఉన్న గౌరవం ను చూపిస్తాయి అని అంటారు. మొత్తానికి వితాబాయి వంటి గొప్ప డాన్సర్‌, మనిషి పాత్రను ప్రేక్షకుల ముందుకు బయోపిక్‌ రూపంలో తీసుకు రావాలి అనుకోవడం చాలా పెద్ద విషయం. అలాంటి పాత్రలను జనాలు చూస్తారా లేదా అనే అనుమానం ఉంటుంది. కానీ దర్శకుడు మాత్రం చాలా నమ్మకంతో ఈ సినిమాను తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. శ్రద్దా కపూర్‌ నటించబోతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి ఛావా సినిమాను మరిపించే విధంగా వసూళ్లు సాధిస్తుందేమో చూడాలి. వివాదాలకు నెలవు అయిన వితాబాయి జీవిత చరిత్రను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడం అనేది అంత సులభమైన విషయం కాదు. కానీ లక్ష్మణ్‌ ఉటేకర్‌ ఎలా ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తాడో చూడాలి.

Tags:    

Similar News