శాన్వీ గుబులు రేపే కరాటే ఫోజ్!
అందం ఉంది.. హొయలు ఉంది.. అన్నటికీ మించి డేర్ ఉంది.. కానీ ఏం లాభం? కన్నడ బ్యూటీ శాన్వీ శ్రీవత్సవ ఇలా వచ్చి అలా ఫ్లాపుల కారణంగా రేసులో వెనక్కి వెళ్లిపోయింది;
అందం ఉంది.. హొయలు ఉంది.. అన్నటికీ మించి డేర్ ఉంది.. కానీ ఏం లాభం? కన్నడ బ్యూటీ శాన్వీ శ్రీవత్సవ ఇలా వచ్చి అలా ఫ్లాపుల కారణంగా రేసులో వెనక్కి వెళ్లిపోయింది. ప్రతిభ ఉన్నా సరైన స్టార్ సరసన అవకాశం దక్కించుకోవడంలో ఫెయిలైంది. కెరీర్ ఆరంభం టాలీవుడ్ యువహీరో ఆది సరసన `లవ్ లీ` అనే చిత్రంలో నటించింది. బి.జయ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ తర్వాత సుశాంత్ సరసన `అడ్డా` అనే ఫ్లాప్ చిత్రంలో నటించింది. మంచు కాంపౌండ్ లో `రౌడీ` అనే మరో ఫ్లాప్ తీవ్రంగా నిరాశపరిచింది. మూడు సినిమాలతో టాలీవుడ్ లో శాన్వీ కథ ముగిసింది.
కన్నడలో వరుస సినిమాలు చేస్తోంది. ఇటీవల విజయం అందుకున్నా, అక్కడ కూడా అడపాదడపా మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం త్రిశూలం అనే చిత్రంలో శాన్వీ నటిస్తోంది. ఉపేంద్ర తెరకెక్కిస్తున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. అయితే సినిమాల్లో అవకాశాల్లేకపోయినా వెబ్ సిరీస్ లలో నటించేందుకు శాన్వీ ఎందుకనో ఆసక్తిని కనబరచలేదు. ఈ భామ ట్రెండ్ ని అనుసరించడంలో వెనకబడింది. ట్రెడిషన్ ని వదిలి గ్లామరస్ పాత్రలను అంగీకరించకపోవడం కెరీర్ కి మైనస్ గా మారింది.
మరోవైపు శాన్వీ శ్రీవత్సవ సోషల్ మీడియాల్లో స్పీడ్ కనబరుస్తోంది. ఈ బ్యూటీ నిరంతర ఫోటోషూట్లు ఇన్ స్టాలో సందడి చేస్తున్నాయి. తాజాగా శాన్వీ మిడీ ధరించి, ఘాటైన ఫోజ్ తో ఆశ్చర్యపరిచింది. ఇది కరాటే భంగిమ. గాల్లోకి అంతెత్తున కాలెత్తి ఫైట్ చేస్తున్న భంగిమతో షాకిచ్చింది. నిజమైన మార్షల్ ఆర్ట్స్ క్వీన్ లా శాన్వీ ఫోజ్ కుర్రకారు గుండెల్లో గుబులు పెంచింది. ప్రస్తుతం ఈ యూనిక్ ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.