టాప్ స్టార్ డైరెక్టర్స్‌కి ఏంటీ పరిస్థితి?
ఇండియా వైడ్‌గా చర్చనీయాంగా మారిన సినిమాలని అందించారు. కానీ ఇప్పుడు మాత్రం భారీ ఫ్లాప్‌లని ఎదుర్కొంటూ కెరీర్‌లో చాలా క్లిష్టమైన ఫేజ్‌ని ఎదుర్కొంటున్నారు.;

కెరీర్‌లో పీక్ స్టేజ్‌ని అనుభవించిన వారు ఒక్కసారిగా కిందపడితే ఆ పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పసుడు ఇదే ఫేజ్‌ని కోలీవుడ్‌కు చెందిన ఇద్దరు టాప్ డైరెక్టర్లు ఎదుర్కొంటున్నారు. ఆ డైరెక్టర్స్ మరెవరో కాదు స్టార్ డైరెక్టర్ శంకర్. క్రేజీ డైరెక్టర్ ఏ.ఆర్. మురుగదాస్. వీరిద్దరు దర్శకులుగా పతాక స్థాయి స్టార్‌డమ్‌ని టచ్ చేశారు. స్టార్ హీరోలు, సూపర్ స్టార్‌లతో కలిసి పని చేశారు. ఇండియా వైడ్‌గా చర్చనీయాంగా మారిన సినిమాలని అందించారు. కానీ ఇప్పుడు మాత్రం భారీ ఫ్లాప్‌లని ఎదుర్కొంటూ కెరీర్‌లో చాలా క్లిష్టమైన ఫేజ్‌ని ఎదుర్కొంటున్నారు.
`జెంటిల్‌మెన్` మూవీతో దర్శకుడిగా పరిచయమైన శంకర్ ఈ సినిమాతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించడం తెలిసిందే. ఆ తరువాత ఇండియన్ మైఖేల్ జాక్సన్‌గా పేరున్నడప్రభుదేవాని హీరోగా పరిచయం చేస్తూ `ప్రేమికుడు`, కమల్ హాసన్‌తో `ఇండియన్`. అర్జున్‌తో ఒకే ఒక్కడు, విక్రమ్‌తో `అపరిచితుడు`, రజనీకాంత్‌తో `శివాజీ, రోబో, విజయ్‌తో `స్నేహితుడు`వంటి బ్లాక్ బస్టర్లని అందించారు.
దర్శకుడిగా శంకర్ డౌన్ ఫాల్ `ఐ`తో మొదలైంది. దాన్ని 2.O, ఇండియన్ 2, గేమ్‌ఛేంజర్ కొనసాగించి ఆయనతో సినిమా అంటే ప్రొడ్యూసర్స్, ఫైనాన్సర్స్ భయంతో పారిపోయే పరిస్థితి ఏర్పడింది. ఓ దశలో హైట్స్ చూసిన శంకర్‌తో సినిమా అంటే ఇప్పుడు ఎవరూ సాహసం చేయడం లేదు. ఏ.ఆర్.మురుగదాస్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. నాగ్ `రక్షకుడు`, వెంకీ `కలిసుందాంరా`, పవన్ కల్యాణ్ `ఖుషీ` సినిమాలకు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పని చేసిన మురుగదాస్ ఆ తరువాత దర్శకుడు ఎస్.జె.సూర్య రికమెండేషన్‌తో అజిత్ నటించిన `దీనా`తో దర్శకుడయ్యారు.
ఆ తరువాత రమణ, గజిని, తుపాకి, కత్తి సిపిమాలతో పాపులర్ అయ్యారు. `గజిని` మూవీని అమీర్ ఖాన్‌తో హిందీలో రీమేక్ చేసి అక్కడ కూడా రికార్డు స్థాయి విజయాన్ని దక్కించుకుని రూ.200 కోట్ల మార్కుని దాటిన తొలి డైరెక్టర్‌గా రికార్డు సాధించారు. ఇంత ట్రాక్ రికార్డ్ ఉన్న మురుగదాస్ ఇప్పుడు వరుస డిజాస్టర్లని ఎదుర్కొంటున్నారు. మహేష్‌తో చేసిన `స్పైడర్`తో డిజాస్టర్‌ని దక్కించుకున్న ఆయన ఐదేళ్ల విరామం తరువాత చేసిన బాలీవుడ్ మూవీ `సికందర్`తోనూ అదే ఫలితాన్ని దక్కించుకుని షాక్ ఇచ్చారు.
ఆయన వరుస ఫ్లాపుల కారణంగా శివకార్తికేయన్‌తో చేసిన `మదరాసి` బిజినెస్ పరంగా తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొంటొంది. ఓ పక్క శంకర్, మరో పక్క ఏ.ఆర్. మురుగదాస్ పరిస్థితిని చూసిన సినీ వర్గాలు కెరీర్‌లో టాప్‌ని టచ్ చేసిన ఈ డైరెక్టర్లకు ఈ పరిస్థితేంటని విచారం వ్యక్తం చేస్తున్నారు.