విదేశీ వీధుల్లో అందాలు ఆరబోస్తున్న అర్జున్ రెడ్డి బ్యూటీ!

ప్రస్తుతం షాలిని పాండే షేర్ చేసిన ఫొటోస్ కి చాలామంది జనాలు హాట్ గా ఉన్నావ్ అంటూ బోల్డ్ గా కామెంట్లు పెడుతున్నారు..;

Update: 2025-09-03 19:03 GMT

షాలిని పాండే.. ఈ పేరు చెబితే అందరికీ గుర్తుకు వచ్చే పేరు ప్రీతి.. ప్రీతి శెట్టి.. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ అయిన హీరోయిన్.. ఈ సినిమాలో బోల్డ్ పాత్రలో నటించి యూత్ క్రష్ గా మారిపోయింది.. అయితే అర్జున్ రెడ్డి సినిమాతో వచ్చిన స్టార్డం ని ఎక్కువ రోజులు కొనసాగించలేకపోయింది షాలిని పాండే. ఆ తర్వాత చేసిన సినిమాల్లో ఏవి కూడా అంత సక్సెస్ అవ్వకపోవడంతో షాలిని పాండేకి ఆఫర్స్ తగ్గిపోయాయి.

 

ఇదిలా ఉండగా ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ఆఫర్ల కోసం సోషల్ మీడియాని ఆయుధంగా మలుచుకుంటారు. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని పెంచుకోవడంతో పాటు సినిమా అవకాశాలు కూడా పట్టేస్తారు. అలా టైం దొరికినప్పుడల్లా విదేశాలకు వెళ్తూ.. అక్కడ వెకేషన్ ని ఎంజాయ్ చేస్తూనే అక్కడి అద్భుతమైన ఫోటోలను, రకరకాల ప్రదేశాల్లో ఎంజాయ్ చేసిన మూమెంట్స్ అన్నింటినీ కూడా అభిమానులతో పంచుకుంటారు.అలా తాజాగా అర్జున్ రెడ్డి హీరోయిన్ షాలిని పాండే ఇటలీ వీధుల్లో విహరించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసుకుంది.

 

ఇటలీలోని రోమ్ వీధుల్లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇటలీ వీధుల్లో విహరిస్తూ అటూ ఇటూ నడుస్తూ ఉన్న ఫొటోస్ ని షేర్ చేసుకుంటూ నడక అంటే పిచ్చి ఉన్న అమ్మాయి అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

ప్రస్తుతం షాలిని పాండే షేర్ చేసిన ఫొటోస్ కి చాలామంది జనాలు హాట్ గా ఉన్నావ్ అంటూ బోల్డ్ గా కామెంట్లు పెడుతున్నారు..

 

అలా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హీరోయిన్ గా రాణిస్తూనే పలు వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. ఇక షాలిని పాండే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది మాత్రం అర్జున్ రెడ్డి మూవీ తోనే.. మొదటి సినిమాతోనే ఈమె క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అంతేకాదు ఈ సినిమా చూసి వచ్చాక ఇండస్ట్రీకి మరో హీరోయిన్ దొరికింది అని ఎంతో మంది దర్శక నిర్మాతలు ఆమె యాక్టింగ్ ని మెచ్చుకున్నారు. తెలుగు రాకపోయినా సరే తెలుగు నేర్చుకుని మరీ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత చేసిన సినిమాలేవి చెప్పుకోదగ్గ హిట్స్ అయితే కాలేదు.

అర్జున్ రెడ్డి మూవీ తర్వాత మహానటి, ఎన్టీఆర్ కథానాయకుడు, 118 వంటి సినిమాల్లో గుర్తింపు లేని పాత్రల్లో నటించింది. కానీ ఈ సినిమాలు ఆమె కెరీర్ కి మైనస్ గా మారాయి.ఆ తర్వాత వచ్చిన సినిమాలేవి కూడా ఆడలేదు. అలా చివరిగా తెలుగులో అనుష్క నటించిన నిశ్శబ్దం సినిమాలో కనిపించింది. ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లిపోయిన ఈ ముద్దుగుమ్మ హిందీలో కూడా కొన్ని సినిమాలు చేసి ప్రస్తుతం ధనుష్ హీరోగా నటిస్తున్న ఇడ్లీ కడై మూవీలో నటిస్తోంది. ఈ హీరోయిన్ నటించిన సినిమాలేవి అంత హిట్ కాకపోవడంతో అరకొర సినిమాలతో ఇండస్ట్రీలో రాణిస్తోంది.. ఇక ఖాళీగా ఉన్న సమయంలో ఇలా ఫ్రెండ్స్ , ఫ్యామిలీతో కలిసి వెకేషన్ లకి వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.

Tags:    

Similar News