'సరకు' తో హీరోగా వచ్చిన రియల్‌ విలన్‌..!

సరకు ట్రైలర్‌ చాలా వారాల క్రితం విడుదల అయ్యింది. ఆ సమయంలో సినిమా గురించి పెద్దగా చర్చ జరగలేదు.

Update: 2023-12-30 06:09 GMT

లియో సినిమా విడుదల అయిన సమయంలో త్రిష పై అసభ్య కామెంట్స్ చేసి విమర్శలు ఎదుర్కొన్న నటుడు మన్సూర్ అలీ ఖాన్‌. ఈయన తీవ్రమైన విమర్శలు ఎదుర్కోవడంతో పాటు, కోర్టు వరకు కూడా వెళ్లడం జరిగింది. టాలీవుడ్‌ ప్రముఖులు కూడా మన్సూర్ అలీ ఖాన్‌ పై విమర్శలు చేసిన వారిలో ఉన్నారు.

మన్సూర్‌ అలీ ఖాన్‌ రేపిన వివాదం కారణంగా ఆయనకు సినీ ఆఫర్లు రావడం కష్టమే అనుకుంటున్న సమయంలో ఏకంగా ఆయన హీరోగా నటించిన 'సరకు' అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా రోజుల క్రితమే విడుదలకు సిద్ధం అయిన సరకు తాజాగా రిలీజ్ అయ్యి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

సరకు ట్రైలర్‌ చాలా వారాల క్రితం విడుదల అయ్యింది. ఆ సమయంలో సినిమా గురించి పెద్దగా చర్చ జరగలేదు. కానీ తాజాగా విడుదల నేపథ్యంలో సినిమా కాన్సెప్ట్‌ గురించి ఆసక్తికర చర్చ జరిగింది. సరకు సినిమాలో మన్సూర్‌ అవినీతి పరుడు అయిన తాగుబోతు లాయర్‌ పాత్రలో నటించాడు.

రియల్‌ విలన్‌ గా పేరు దక్కించుకున్న మన్సూర్‌ అలీ ఖాన్‌ సినిమాలో హీరోగా నటించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. సినిమాకు నెగటివ్‌ ప్రచారం వచ్చినా కూడా థియేటర్లలో సందడి చేస్తోందని తమిళ మీడియా వర్గాల వారు మరియు బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటూ ఉన్నారు.

Read more!

మన్సూర్‌ అలీ ఖాన్‌ ను బహిష్కరించాలి అంటూ డిమాండ్‌ చేసిన వారు కూడా ఇప్పుడు సరకు సినిమా గురించి మౌనంగా ఉన్నారు. వారు సినిమాకు వ్యతిరేకంగా మాట్లాడితే మరింత పబ్లిసిటీ వస్తుందనే ఉద్దేశ్యంతో సరకు సినిమా విషయంలో చాలా మంది మౌనంగా ఉన్నారు. అయినా కూడా సోషల్‌ మీడియాలో సినిమాకు ప్రచారం లభించింది. మంచి వసూళ్లు నమోదు అవుతున్నాయి అంటున్నారు.

Full View
Tags:    

Similar News