స్పిరిట్ తో పాటే మరోటి.. సందీప్ ప్లాన్ చేంజ్..?

సందీప్ వంగ తన సినిమా మొదలైతే పరుగులు పెట్టిస్తాడు. అంతేకాదు రిలీజ్ వరకు పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్తాడు.;

Update: 2025-04-23 18:03 GMT
స్పిరిట్ తో పాటే మరోటి.. సందీప్ ప్లాన్ చేంజ్..?

యానిమల్ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న డైరెక్టర్ సందీప్ వంగా తన నెక్స్ట్ సినిమా రెబల్ స్టార్ ప్రభాస్ తో స్పిరిట్ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. తన మార్క్ ఒక పొలీస్ స్టోరీతో రాబోతున్నాడు. ఈ సినిమాను ప్రత్యేకంగా తెరకెక్కించే ప్లానింగ్ లో ఉన్నాడు. ప్రభాస్ ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నాడు. ఐతే స్పిరిట్ సినిమా కు ప్రభాస్ డేట్స్ ఇవ్వాలంటే కమిట్ అయిన సినిమాలు పూర్తి చేయాలి.

సందీప్ వంగ తన సినిమా మొదలైతే పరుగులు పెట్టిస్తాడు. అంతేకాదు రిలీజ్ వరకు పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వెళ్తాడు. ప్రభాస్ ఈమధ్య సినిమాలైతే లైన్ లో పెడుతున్నాడు కానీ పూర్తి చేయడం మాత్రం లేట్ అవుతుంది. అందుకే ప్రభాస్ స్పిరిట్ తో పాటు సందీప్ మరో ప్లాన్ కూడా చేసినట్టు తెలుస్తుంది. సందీప్ తో సినిమా చేసేందుకు చాలామంది స్టార్స్ రెడీగా ఉన్నారు. వారిలో అల్లు అర్జున్, రామ్ చరణ్, విజయ్ దేవరకొండ ఉన్నారు.

స్పిరిట్ సెట్స్ మీదకు తీసుకెళ్లి అది చేస్తూనే చరణ్ సినిమా లేదా విజయ్ తో సినిమా పనులు మొదలు పెట్టాలని ఫిక్స్ అయ్యాడట సందీప్ వంగ. ఎందుకంటే ప్రభాస్ సినిమా కోసమే మరో 3 ఏళ్లు టైం పెడితే నెక్స్ట్ సినిమాకు మరో ఏడాది దాకా పడుతుందని అనుకుంటున్నాడు. అందుకే ప్రభాస్ సినిమాతో మొదలు పెట్టి అది చేస్తూనే మరో సినిమాను కూడా స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు.

అలా కాకుండా ప్రభాస్ స్పిరిట్ పూర్తిగా ఏడాదిలో పూర్తి చేసేలా ఉంటే అలా సినిమాను చకచకా చేసి నెక్స్ట్ సినిమాకు వెళ్లే ఛాన్స్ ఉంటుంది. మరి ప్రభాస్ సందీప్ కి అతను కోరిన టైం ఇస్తాడా లేదా అన్నది చూడాలి. వీటితో పాటు సందీప్ వంగాకి యానిమల్ పార్క్ కూడా ఉంది కాబట్టి అది కూడా చేయాలనే ప్లానింగ్ లో ఉన్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా ఉన్న సందీప్ వంగా సినిమాలతో ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ ఇవ్వాలని చూస్తున్నాడు. ప్రభాస్ స్పిరిట్ కోసం మాత్రమే పనిచేసే ఛాన్స్ ఉందా లేదా అన్నది చూడాలి. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్, ఫౌజీ సినిమాలు చేస్తున్నాడు. స్పిరిట్ ఎప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఉన్నారు.

Tags:    

Similar News