స‌మంత క్రిప్టిక్ పోస్ట్ వైర‌ల్

స‌మంత రూత్ ప్ర‌భు వృత్తి గ‌త జీవితం ఎలా ఉన్నా, సామాజిక సేవ‌ల‌తో ఎప్పుడూ మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తుంది.;

Update: 2025-04-25 03:48 GMT

స‌మంత రూత్ ప్ర‌భు వృత్తి గ‌త జీవితం ఎలా ఉన్నా, సామాజిక సేవ‌ల‌తో ఎప్పుడూ మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తుంది. సామ్ ప్ర‌త్యూష పేరుతో ఒక‌ ఎన్జీవోని ర‌న్ చేస్తూ అనాధ‌లు, పేద‌లు, అవ‌స‌రార్థుల‌ను ఆదుకుంటున్న సంగ‌తి తెలిసిందే.


తాజాగా స‌మంత సోష‌ల్ మీడియాలో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ను పోస్ట్ చేసారు. ``మ‌నం పుట్టింది ఇత‌రుల‌కు స‌హాయం చేసేందుకే. స‌మాజం మ‌నం ఎంత సంతోషంగా ఉన్నాము అన్న‌ది చూడ‌దు. మ‌న వ‌ల్ల ఇత‌రుల‌కు ఎంత సాయం అందింది అనేదే చూస్తుంది!`` అని రాసారు. నిజ‌మే స‌మాజం పోక‌డ గురించి స‌మంత బాగా సంగ్ర‌హించింది.

సామ్ వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ 100 కోట్లు పైగా ఆర్జించింద‌ని ఇంత‌కుముందు క‌థ‌నాలొచ్చాయి. ఆర్థికంగా బాగా స్థిర‌ప‌డిన స‌మంత వీలున్నంత వ‌ర‌కూ అవ‌స‌రంలో ఉన్న‌వారికి సాయం అందిస్తున్నారు. ఇక సామ్ కెరీర్ మ్యాట‌ర్ క వ‌స్తే... నందిని రెడ్డి దర్శకత్వంలో `మా ఇంటి బంగారం`లో స‌మంత‌ న‌టిస్తోంది. ఆ ఇద్ద‌రి కాంబినేష‌న్ లో నే `ఓ బేబి` వ‌చ్చి ఘ‌న‌విజయం సాధించింది. ఇప్పుడు మ‌రోసారి ఈ జోడీ క‌లిసి ప‌ని చేస్తుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

Tags:    

Similar News