'స్కంద' బ్యూటీ సారీలో సూపర్ హాట్!
వైట్ అండ్ వైట్ లో అందంగా ముస్తాబైంది. కొప్పులో మల్లె పువ్వులు... చెవులకు పొడవైనా చెవులీలు ధరించి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
'మేజర్' తో సాయి మంజ్రేకర్ మంత్రముగ్దుల్ని చేసింది. అమ్మడు రెండవ సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది. యాక్టింగ్ స్కిల్స్ తో పాటు బ్యూటీ విషయంలోనూ ఏమాత్రం తక్కువ కాదని నిరూపిం చింది. ఎవరీ? లేత సోయగం అంటూ నెట్టింట చర్చకు తెర తీసింది. అటుపై సోషల్ మీడియాలో తనదైన ఎలివేషన్లతో బాలీవుడ్ భామలకి ఏమాత్రం తక్కువ కాదని చాటి చెప్పింటి. చిట్టి పొట్టి దుస్తుల్లో..హాట్ హాట్ ఫిట్ నెస్ వీడియోలతో కుర్ర కారులు సలపరం పుట్టించింది.
రీసెంట్ గానే అమ్మడి ఫిట్ నెస్ వీడియో ఒకటి నెట్టింట దుమారం రేపింది. ఆ వేడి ఇంకా చల్లారక ముందే అమ్మడు మరో టెంప్టింగ్ ఫోజుతో నెటి జనుల ముందుకొచ్చేసింది. ఇదిగో ఇక్కడిలో సంప్రదాయ సారీ..రవికలో ఒదిగిపోయింది. వైట్ అండ్ వైట్ లో అందంగా ముస్తాబైంది. కొప్పులో మల్లె పువ్వులు... చెవులకు పొడవైనా చెవులీలు ధరించి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
అమ్మడి స్కిన్ టోన్ మిల మిలా మెరిసిపోతుంది. ప్రస్తుతం ఈ ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది. అమ్మడి ఫాలోవర్స్ చీరందాన్ని తమదైన శైలిలో వర్ణించే కవులైపోతున్నారు.
సాయి మంజ్రేకర్ తోలుత వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'గని 'సినిమాలో నటించింది. కానీ అమ్మడికి తొలి సినిమానే చేదు అనుభవాన్ని మిగిల్చింది. దీంతో బ్యూటీ పెద్దగా ఫోకస్ అవ్వలేదు. మేజర్ తో పాన్ ఇండియాలో గుర్తింపు వచ్చింది. అదే ఐడెంటీ..ప్రతిభతో ఎనర్జిటిక్ స్టార్ రామ్-బోయపాటి స్కందలో అవకాశం తెచ్చిపెట్టింది. ఇది పాన్ ఇండియాలో రిలీజ్ అవుతుంది. ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకుంది.
చేతిలో బాలీవుడ్ లో రెండు ఛాన్సులు ఉన్నప్పటికీ టాలీవుడ్ లో రాణించాలని ఆశపడుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడే సీరియస్ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. తండ్రి మహేష్ మంజ్రేకర్ కూడా తెలుగుల బాగా పాపులర్ అయిన విలన్. కొందరు స్టార్ హీరోలతో ఆయన పనిచేసారు.