పాత్ర‌పై నేష‌న‌ల్ క్ర‌ష్ భ‌యాలు

నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మిక మందన్న వైవిధ్యభరితమైన పాత్రలతో నిరూపించుకుంటూ దూసుకుపోతున్నారు.

Update: 2026-06-06 18:30 GMT

నేషనల్ క్రష్ గా గుర్తింపు తెచ్చుకున్న నటి రష్మిక మందన్న వైవిధ్యభరితమైన పాత్రలతో నిరూపించుకుంటూ దూసుకుపోతున్నారు. దక్షిణాది చిత్రాల నుండి బాలీవుడ్ వరకు అమ్మ‌డి ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచింది. అయితే తాజాగా ర‌ష్మిక హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ చిత్రం 'కాక్‌టెయిల్ 2' ప్ర‌చార కార్య‌క్ర‌మంలో భాగంగా కెరీర్ .. ఈ సినిమాలో తాను పోషించిన పాత్ర గురించి చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. సినిమాలో తాను పోషించిన దియా అనే మోడ్రన్ అర్బన్ క్యారెక్టర్‌ను అంగీకరించే ముందు చాలా భయపడ్డానని.. అస్సలు నిద్రపోని రాత్రులు కూడా గడిపానని మనసులోని మాటను బయటపెట్టారు.

అందుకు గ‌ల కార‌ణాల‌ను కూడా అమ్మ‌డు రివీల్ చేసింది. త‌న‌ గత చిత్రాలైన 'పుష్ప','యానిమల్','డియర్ కామ్రేడ్'వంటి సినిమాల్లో ప్రేక్షకులు తనను చాలా ఎమోషనల్, సీరియస్ ..క‌న్నీళ్లు పెట్టించే పాత్రల్లోనే ఎక్కువగా చూశారని గుర్తుచేసింది. 'నా కెరీర్‌లో ఇప్పటి వరకు చేసిన చిత్రాల వల్ల ప్రేక్షకులు నా నుండి ఎప్పుడూ ఒక రకమైన గంభీరమైన .. హై-డ్రామా నటననే ఆశిస్తారని నాకు తెలుసు. కానీ ఈ సినిమాలో నా లుక్ .. క్యారెక్టరైజేషన్ పూర్తి అర్బన్ శైలిలో ఉంటుంది. ఇంతటి అల్ట్రా-మోడ్రన్ పాత్రలో ప్రేక్షకులు నన్ను స్వీకరిస్తారా లేదా అనే సందేహం నన్ను వెంటాడుతుంది' అని తెలిపింది.

ఈ సినిమా కథాంశం అంతా ముగ్గురు స్నేహితుల మధ్య జరిగే గందరగోళం, స్నేహం , సమకాలీన ప్రేమ చుట్టూ తిరుగుతుంది. ఒక వైపు భయం ఉన్నప్పటికీ ప్రాజెక్ట్‌ను ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్నపై రష్మిక స్పందించింది.. నటిగా ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు చేయడం వల్ల ప్రేక్షకులకు బోర్ కొడుతుందని అందుకే ఈసారి పూర్తిగా భిన్నమైన తేలికపాటిఎంటర్‌టైనర్ చేయడం థ‌క్ష ఆడియన్స్‌కు సర్‌ప్రైజ్ ఇవ్వాలని భావించినట్లు తెలిపారు.

`ఈ పాత్రను నేను చేయగలనా? ఇది సరైన నిర్ణయమేనా?` అని మొదట్లో సందేహించినా? నటిగా తనను తాను సవాలు చేసుకోవడానికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపింది. ఈ చిత్రంలో సహ నటీనటులైన షాహిద్ కపూర్, కృతి సనన్‌లతో పని చేయడం తనకు ఎంతో అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని రష్మిక సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా కృతి సనన్‌తో జిమ్‌లో వర్కవుట్స్ చేసే సమయంలో ఏర్పడిన స్నేహం, షూటింగ్ సెట్స్‌లో తమ మధ్య కెమిస్ట్రీ పండటానికి ఎంతో సహాయపడిందని తెలిపారు. దినేష్ విజన్ నిర్మించిన ఈ భారీ బడ్జెట్ రొమాంటిక్ కామెడీ చిత్రం జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది.

Tags:    

Similar News