రమణీ కళ్యాణం.. సింప్లీ సూపర్బ్

చిన్న సినిమాలు థియేటర్లలో నిలబడాలంటే కొత్తదనం, హృదయానికి హత్తుకునే ఎమోషన్, ప్రేక్షకుడిని కట్టిపడేసే వినోదం తప్పనిసరి.

Update: 2026-05-13 04:29 GMT

చిన్న సినిమాలు థియేటర్లలో నిలబడాలంటే కొత్తదనం, హృదయానికి హత్తుకునే ఎమోషన్, ప్రేక్షకుడిని కట్టిపడేసే వినోదం తప్పనిసరి. ఇప్పుడు ఆడియన్స్ కూడా రొటీన్ కథలకంటే యూనిక్ కాన్సెప్ట్స్ వైపు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు. అలాంటి ప్రామిసింగ్ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న చిత్రం రమణీ కళ్యాణం. తాజాగా వచ్చిన టీజర్ చూస్తుంటే ప్రస్తుత ప్రేక్షకుల అభిరుచిని బాగా అర్థం చేసుకుని తీర్చిదిద్దిన సినిమాలా అనిపిస్తోంది.

సూర్య వశిష్ట, దీప్షిక హీరో హీరోయిన్లుగా విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌ను కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. కోర్ట్ మూవీ ఫేం రామ్ జగదీష్ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించడం మరో ప్రత్యేక ఆకర్షణ. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచేసింది.

చూపులేని అమ్మాయి… నడవలేని అబ్బాయి… ఈ ఇద్దరి జీవితాల మధ్య పుట్టిన భావోద్వేగ ప్రయాణమే రమణీ కళ్యాణం. వినడానికి సీరియస్‌గా అనిపించే ఈ కథను దర్శకుడు ఎంతో హృద్యంగా, అదే సమయంలో ఎంటర్‌టైనింగ్‌గా మలిచిన తీరు టీజర్‌లోనే కనిపించింది. పెళ్లి చూపుల సన్నివేశంతో మొదలయ్యే టీజర్ ఆద్యంతం నవ్వులు, భావోద్వేగాలతో ఆకట్టుకుంది.

సూర్య వశిష్ట, దీప్షికల నటన చాలా సహజంగా అనిపించింది. వారి పాత్రల్లో ఎమోషన్‌ను మరింత బలంగా నిలబెట్టింది. ఇలాంటి కథల్లో సందేశం ఎక్కువై డ్రామా తగ్గిపోవడం సాధారణం. కానీ దర్శకుడు విజయ్ ఆదిరెడ్డి మాత్రం ఎక్కడా బోర్ అనిపించకుండా భావోద్వేగాలకు వినోదాన్ని జోడించి బ్యాలెన్స్ చేయడం విశేషం.

మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్..అన్నీ కూడా టీజర్‌కి మంచి ఫీల్ తీసుకొచ్చాయి. ముఖ్యంగా కొన్ని విజువల్స్, డైలాగ్స్ ప్రేక్షకుల మనసులో నిలిచిపోయేలా ఉన్నాయి. మొత్తంగా రమణీ కళ్యాణం టీజర్ సినిమాపై ఆసక్తి మరింతగా పెంచింది.



Full View


Tags:    

Similar News