చరణ్ 'పెద్ది'.. ఐమ్యాక్స్ రిలీజ్ ప్లస్ కానుందా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ పెద్ది విడుదలకు సిద్ధమైంది.

Update: 2026-06-01 12:57 GMT

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ పెద్ది విడుదలకు సిద్ధమైంది. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానున్న ఆ సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఆ చిత్రాన్ని మరింత గ్రాండ్‌ గా ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు మేకర్స్ స్పెషల్ ప్లాన్ తో ఉన్నారు.




అందులో భాగంగానే పెద్దిని ఐమ్యాక్స్ ఫార్మాట్‌ లో కూడా విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు. ఆ నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా విజువల్‌ గా భారీ స్థాయిలో రూపొందిన సినిమాలు ఐమ్యాక్స్ స్క్రీన్లలో ప్రేక్షకులకు మంచి ఎక్స్పీరియన్స్ అందిస్తాయి. దీంతో పెద్దికి కూడా ఐమ్యాక్స్ ఫార్మాట్ ఎక్స్ ట్రా అట్రాక్షన్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నిజానికి సినిమాలో 1980ల నాటి విలేజ్ ఆంధ్రప్రదేశ్‌ బ్యాక్ డ్రాప్ లో కథ సాగనున్నట్లు ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ ద్వారా క్లారిటీ వచ్చింది. విలేజ్ లైఫ్, స్పోర్ట్స్ ఎలిమెంట్స్, ఎమోషన్స్, యాక్షన్ అంశాలు సిల్వర్ స్క్రీన్ పై మరింత ఎఫెక్టివ్ గా చూపించేందుకు దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాంటి విజువల్ అంశాలు ఎక్కువగా ఉన్న చిత్రాలకు ఐమ్యాక్స్ ఫార్మాట్ మంచి సపోర్ట్ గా నిలుస్తుంది.

ముఖ్యంగా రామ్ చరణ్ రోల్, ఆయన మాస్ లుక్, స్పోర్ట్స్ ఎపిసోడ్స్, యాక్షన్ సీన్స్ ఐమ్యాక్స్ స్క్రీన్లలో మరింత ఎలివేట్ అయ్యే అవకాశం ఉంది. ప్రేక్షకులు థియేటర్‌ లో కూర్చుని సినిమా చూస్తున్న ఎక్స్పీరియన్స్ కంటే, కథలో భాగమైన ఫీలింగ్ కలిగించే స్టామినా ఐమ్యాక్స్‌ కు ఉంటుంది. అందుకే మేకర్స్ ఆ ఫార్మాట్‌ పై స్పెషల్ గా ఫోకస్ పెట్టినట్లు క్లియర్ గా తెలుస్తోంది. ఇటీవల కాలంలో భారీ బడ్జెట్ చిత్రాలు ఐమ్యాక్స్‌ లో విడుదల కావడం సాధారణంగా మారింది. అయితే ప్రతి సినిమాకు ఆ ఛాన్స్ దక్కదు.

కథకు తగ్గ విజువల్ స్కేల్, టెక్నికల్ క్వాలిటీ, ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్న సినిమాలకే ఆ ఛాన్స్ వస్తుంది. ఆ యాంగిల్ లో చూస్తే పెద్ది కూడా తన ప్రొడక్షన్ వాల్యూస్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు అర్థమవుతోంది. అంతేకాకుండా ఐమ్యాక్స్ రిలీజ్ వల్ల అడ్వాన్స్ బుకింగ్స్, ప్రీమియం టికెట్ సేల్స్ పరంగా కూడా సినిమాకు కొంత అదనపు ప్రయోజనం లభించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ను ఇష్టపడే సినీ అభిమానులు ఐమ్యాక్స్ వెర్షన్‌ కు ప్రాధాన్యం ఇచ్చే ఛాన్స్ ఉంది.

మరోవైపు సినిమా కంటెంట్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందనేదే చివరికి సక్సెస్ ను నిర్ణయించే ఎలిమెంట్. అయినప్పటికీ ఐమ్యాక్స్ విడుదల మాత్రం పెద్దిపై ఉన్న అంచనాలను మరింత పెంచిందనే చెప్పాలి. భారీ విజువల్స్, మాస్ ఎలిమెంట్స్, స్పోర్ట్స్ బ్యాక్‌ డ్రాప్‌ తో వస్తున్న ఆ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ పై ఆస్వాదించాలని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో మంచి హైప్ సొంతం చేసుకున్న పెద్దికి ఐమ్యాక్స్ రిలీజ్ మరో అసెట్ గా మారుతుందా లేదా అనేది విడుదల తర్వాత క్లారిటీ రానుంది.

Tags:    

Similar News