ర‌ఫ్ఫాడిస్తున్న రాయ్ ల‌క్ష్మీ

ల‌క్ష్మీ రాయ్ బ్లూ అండ్ బ్లూ లుక్ ఇంట‌ర్నెట్ లో చ‌ర్చ‌గా మారింది. ఈ బ్యూటీ అందాల ఆర‌బోత‌కు ఎంత‌మాత్రం వెన‌కాడ‌దు.;

Update: 2025-05-27 18:56 GMT

రాయ్ ల‌క్ష్మీ అలియాస్ ర‌త్తాలు ప్ర‌స్తుతానికి సోష‌ల్ మీడియా ప్ర‌మోష‌న్స్ తో స‌రిపెట్టుకుంటోంది. గ‌త కొంత‌కాలంగా రాయ్ ల‌క్ష్మీ షేర్ చేస్తున్న ఫోటోలు వీడియోలు ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ గా మారుతున్నాయి. తాజాగా మ‌రోసారి ర‌త్తాలు ఫోటోషూట్ అంత‌ర్జాలాన్ని షేక్ చేస్తోంది.

 

ల‌క్ష్మీ రాయ్ బ్లూ అండ్ బ్లూ లుక్ ఇంట‌ర్నెట్ లో చ‌ర్చ‌గా మారింది. ఈ బ్యూటీ అందాల ఆర‌బోత‌కు ఎంత‌మాత్రం వెన‌కాడ‌దు. చుట్టూ కొండ‌లు, మ‌ధ్య‌లో స్విమ్మింగ్ పూల్, అక్క‌డ రాయ్ ల‌క్ష్మీ ఫోజులు... ఇది చూడ‌గానే ర‌త్తాలు త‌గ్గేట్టే లేదు! అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

 

మెగాస్టార్ ఖైదీ నంబ‌ర్ 150 లో ర‌త్తాలు పాట చాలా పాపుల‌రైంది. కానీ ఇటీవ‌ల ల‌క్ష్మీరాయ్ కి స‌రైన అవ‌కాశాల్లేవ్. కొన్ని సినిమాల్లో న‌టిస్తోంది. కానీ వాటికి సంబంధించిన అప్ డేట్లు ఏవీ రాలేదు. బాలీవుడ్ లో `ఆఫీస‌ర్ అర్జున్ సింగ్- ఐపీఎస్ బ్యాచ్ 2000` అనే చిత్రంలో ఐటెమ్ నంబ‌ర్ లో ఆడిపాడింది. అలాగే ఝాన్సీ- సిండ్రెల్లా- ఆనంద భైర‌వి అనే చిత్రాలు సెట్స్ పై ఉన్నాయని ప్ర‌చారం సాగింది. కానీ వీటిలో ఏది రిలీజ‌వుతోంది .. ఏ మూవీ మ‌ధ్య‌లో ఆగిపోయింది? అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ప్ర‌స్తుతానికి రాయ్ ల‌క్ష్మీ త‌న‌దైన శైలిలో ఆస్వాధ‌న‌ల్లో మునిగి తేల్తోంది.

Tags:    

Similar News