అప్పటిదాకా పుష్ప 3 ని మర్చిపోవాల్సిందేనా..?

ఈ మధ్య పుష్ప నిర్మాత మాత్రం 2028 పుష్ప 3 వస్తుందని చెప్పినా అదంతా ఈజీగా జరిగే పని కాదన్నట్టుగానే ఉంది.;

Update: 2025-05-28 00:30 GMT
అప్పటిదాకా పుష్ప 3 ని మర్చిపోవాల్సిందేనా..?

పుష్ప 1, 2 సినిమాలు రెండు మాస్ ఆడియన్స్ ని బాగా మెప్పించాయి. ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. బీ టౌన్ మాస్ ఆడియన్స్ కి మంచి మసాలా ఫీస్ట్ అందించాడు పుష్ప రాజ్. అందుకే పుష్ప 1 సూపర్ హిట్ కాగా పుష్ప 2 దాన్ని మించి సంచలనంగా మారింది. ఐతే పుష్ప 2 తో కథ ముగిస్తాడు అనుకున్న సుకుమార్ కాస్త పుష్ప 3 అంటూ సర్ ప్రైజ్ చేశాడు. పుష్ప 3 రాంపేజ్ అంటూ పోస్టర్ తో హైప్ ఎక్కించాడు.

ఐతే పుష్ప 3 ని కాస్త టైం తీసుకుని చేయాలని ఫిక్స్ అయ్యాడు సుకుమార్. ఈలోగా ఒకటి రెండు సినిమాలు చేసి మళ్లీ పుష్ప 3 కి పనిచేయనున్నాడు. అల్లు అర్జున్ కూడా నెక్స్ట్ అట్లీతో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కావాలంటే ఎలా లేదన్నా రెండేళ్లు పైన పడుతుంది. అట్లీ సినిమా తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రం తో సినిమా చేయాలని చూస్తున్నాడు. అది కూడా సెట్స్ మీదకు వెళ్తే పుష్ప 3 మరింత లేట్ అవుతుంది.

ఈ మధ్య పుష్ప నిర్మాత మాత్రం 2028 పుష్ప 3 వస్తుందని చెప్పినా అదంతా ఈజీగా జరిగే పని కాదన్నట్టుగానే ఉంది. ఎందుకంటే అట్లీ సినిమానే దాదాపు 2027 దాకా చేసే మూమెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ త్రివిక్రం సినిమా కమిటైతే మాత్రం అదో రెండేళ్లు పైన ఉంటుంది. అంటే ఎలా చూసినా 2028 లో పుష్ప 3 సాధ్యం కాదు సరికదా అసలు అప్పటికి సెట్స్ మీదకు వెళ్లడం కూడా గొప్ప విషయం అనిపిస్తుంది.

పుష్ప 3 విషయంలో సుకుమార్, అల్లు అర్జున్ లెక్కలు ఎలా ఉన్నాయో కానీ ఆ సినిమా ఎప్పుడు వచ్చినా కూడా పుష్ప 2 ని మించి హిట్ చేసేందుకు ఆడియన్స్ సిద్ధంగా ఉన్నారు. పుష్ప రాజ్ మేనియాని మరోసారి తెర మీద చూపించేలా అల్లు అర్జున్ సుకుమార్ కాస్త టైం తీసుకున్నా అంచనాలను మించి ఉండేలా చేస్తారని చెప్పొచ్చు. అట్లీ మూవీ, త్రివిక్రం ప్రాజెక్ట్ ఈ రెండిటి తర్వాత అల్లు అర్జున్ రేంజ్ నెక్స్ట్ లెవెల్ వెళ్తుంది. ఆ టైంలో పుష్ప 3 రాంపేజ్ మరింత బాక్సాఫీస్ విధ్వంసం సృష్టించే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు.

Tags:    

Similar News