అల్లు అర్జున్ - అట్లీ.. ఆమె రిజెక్ట్ చేసిందా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాస్ కమర్షియల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఓ భారీ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కబోతోన్న విషయం తెలిసిందే.;

Update: 2025-04-11 13:30 GMT
అల్లు అర్జున్ - అట్లీ.. ఆమె రిజెక్ట్ చేసిందా?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాస్ కమర్షియల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఓ భారీ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కబోతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌పై భారీ స్థాయిలో బజ్ క్రియేట్ అయింది. ఇటీవల విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ వీడియో ప్రేక్షకుల్లో మంచి హైప్ తెచ్చింది. విజువల్స్‌ దెబ్బకి, అట్లీ మేకింగ్ శైలికి మరోసారి అభిమానుల్లో నమ్మకమొచ్చింది. దీనికి తోడు హాలీవుడ్ స్థాయి వీఎఫ్ఎక్స్ స్టూడియోలతో కలిసి రూపొందిస్తున్న సినిమా కావడంతో ప్రాజెక్ట్‌పై ఆసక్తి ఇంకా పెరిగిపోయింది.

ఇప్పటికే లాస్ ఏంజిల్స్ వెళ్లి బన్నీ-అట్లీ వీఎఫ్ఎక్స్ టీంతో ప్రత్యేకంగా వర్క్‌ షాపులు కూడా నిర్వహించారు. ఈ సినిమాకు దాదాపు 800 కోట్ల బడ్జెట్ కేటాయించినట్టు టాక్. ఇందులో ఒక్క వీఎఫ్ఎక్స్‌ పనులకే ₹250 కోట్లను ఖర్చు చేయనున్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో డిజిటల్ డీ ఏజింగ్ టెక్నాలజీ, హై టెక్ విజువల్స్, డ్యూయల్ షేడ్స్‌లో బన్నీ లుక్ వంటి అంశాలు చర్చనీయాంశమయ్యాయి.

2026లో ఈ సినిమా విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు జాతీయ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. అయితే ఇంకా కథానాయికపై క్లారిటీ లేదు. సమంత, రష్మిక వంటి పేర్లు చక్కర్లు కొట్టాయి. తర్వాత బాలీవుడ్ నుంచి ఓ స్టార్ హీరోయిన్ ఉండే అవకాశం ఉందంటూ వార్తలు వచ్చాయి. మరి ఆ స్టార్ ఎవరు అన్న అనుమానాలకు తెరదించే విధంగా.. తాజాగా ప్రియాంకా చోప్రా పేరు తెరపైకి వచ్చింది.

అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. ప్రియాంకా ఈ సినిమాలో నటించేందుకు నిరాకరించిందట. ఆమెను ఈ సినిమాకు అట్లీ అప్రోచ్ చేయగా, కథలో కొన్ని క్రియేటివ్ డిఫరెన్సుల వల్ల ఆమె ప్రాజెక్ట్ ను రిజెక్ట్ చేసినట్లు టాక్ వస్తోంది. ఇది ఇలా ఉండగా.. ప్రియాంకాకు అదే సమయంలో దర్శకధీరుడు రాజమౌళి కూడా ‘SSMB29’ సినిమాకు సంబంధించిన కథను చెప్పినట్టు టాక్. అమెజాన్ అడవుల్లో జరుగుతున్న అడ్వెంచర్ నేపథ్యంలో ఉన్న ఈ కథ ఆమెను ఎంతగానో ఆకట్టుకుందట.

ఫలితంగా ఆమె అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్‌ను వదులుకుని, మహేష్ బాబు-రాజమౌళి సినిమా కోసం ఒప్పుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. అధికారికంగా ఈ విషయాలపై ఎలాంటి ధృవీకరణ రాలేదు కానీ, ట్రేడ్ సర్కిల్లో మాత్రం ఇది హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ప్రియాంకా హాలీవుడ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. అయినా ఆమె ఓ తెలుగు సినిమా కోసం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు. ఆమె చాలా సినిమాలతో దేశవిదేశాల్లో గుర్తింపు తెచ్చుకుంది.

అలాంటి టైంలో రాజమౌళి సినిమాను ఎంచుకోవడం చూస్తే, ఆమె స్క్రిప్ట్ లెవెల్‌పై ఎంత కాన్ఫిడెంట్ గా ఉంటుందో అర్థమవుతోంది. పైగా ఆ సినిమా పాన్ వరల్డ్ లెవెల్లో ఉండబోతున్న నేపథ్యంలో ఆమె కెరీర్‌కు ఇది బూస్ట్ కూడా అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. మొత్తంగా చూస్తే.. బన్నీ అట్లీ లాంటి మాస్ కాంబోలో ఒక స్టార్ హీరోయిన్ ఉండాల్సిన అవసరం ఉందన్న మాట నిజమే. ప్రియాంకా వంటి నేషనల్ ఇంటర్నేషనల్ రేంజ్ ఉన్న హీరోయిన్ రిజెక్ట్ చేయడం ఊహించని పరిణామమే. అయితే ప్రస్తుతం మరో స్టార్ హీరోయిన్ కోసం మేకర్స్ ట్రై చేస్తున్నట్టు సమాచారం.

Tags:    

Similar News