ట్రైలర్ టాక్: గ్లోబల్ ఐకన్ మరో ఛాలెంజింగ్ రోల్
గ్లోబల్ ఐకన్ గా పాపులరైంది ప్రియాంక చోప్రా. హాలీవుడ్, బాలీవుడ్ లో పెద్ద స్టార్. హాలీవుడ్ లో బేవాచ్, క్వాంటికో సిరీస్ సహా సిటాడెల్ ఫ్రాంఛైజీ నటిగా గొప్ప పాపులారిటీ దక్కించుకుంది.;
గ్లోబల్ ఐకన్ గా పాపులరైంది ప్రియాంక చోప్రా. హాలీవుడ్, బాలీవుడ్ లో పెద్ద స్టార్. హాలీవుడ్ లో బేవాచ్, క్వాంటికో సిరీస్ సహా సిటాడెల్ ఫ్రాంఛైజీ నటిగా గొప్ప పాపులారిటీ దక్కించుకుంది. ఇప్పుడు టాలీవుడ్ లో దర్శకధీరుడు రాజమౌళి- మహేష్ కాంబినేషన్ మూవీలో నటిస్తోంది. ప్రియాంక చోప్రాకు ఉన్న గ్లోబల్ అప్పీల్ రాజమౌళి - మహేష్ సినిమా మార్కెట్ రేంజును పెంచుతుందన్న విశ్లేషణలు సాగుతున్నాయి.
ఇలాంటి సమయంలో ప్రియాంక చోప్రా నటించిన మరో భారీ హాలీవుడ్ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా పీసీ నటించిన `హెడ్స్ ఆఫ్ స్టేట్` ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ ఆద్యంతం గగుర్పాటుకు గురి చేసే యాక్షన్ విన్యాసాలతో రక్తి కట్టిస్తోంది. ఇందులో జాన్ సెనా, ఇద్రియాస్ ఎల్బా లాంటి టాప్ స్టార్స్ తో కలిసి పీసీ యాక్షన్ ఎపిసోడ్స్ ని పండించిన తీరు ఆకట్టుకుంది.
జాన్ సెనా అమెరికా అధ్యక్షుడిగా నటించగా, ఇద్రియాస్ బ్రిటన్ ప్రధానిగా (ఇద్దరు హెడ్స్) కీలక పాత్రలను పోషించారు. అయితే ఆ ఇద్దరూ దుర్భేధ్యమైన సెక్యూరిటీని అధిగమించి ఎవరికీ అంతు చిక్కని గమ్యస్థానంలో చిక్కుకుపోతారు. విమానప్రమాదంలో వారు ఎక్కడికి చేరుకున్నారు? అన్నది ఎవరికీ తెలీదు. కానీ అక్కడ కూడా వీరిని శత్రువులు వెంటాడుతూ ఉంటారు. ఇలాంటి సమయంలో ఎంట్రీ ఇస్తుంది గ్లోబల్ ఐకన్ ప్రియాంక చోప్రా. ఆ ఇద్దరినీ కాపాడేందుకు వచ్చిన రియల్ ఎంఐ6 ఏజెంట్ నోయెల్ బిస్సిట్ (పీసీ) స్టోరి ఏమిటన్నది మిగతా సినిమా. మొత్తానికి కథ వినేందుకు ఎంత సింపుల్ గా ఉందో అంతటి కాంప్లికేటెడ్ విషయాలతో రక్తి కట్టించే ఎపిసోడ్స్ తో సాగింది ట్రైలర్. ట్రైలర్ లో ప్రధాన పాత్రధారుల నడుమ ఫన్, ఎంటర్ టైన్ మెంట్ కి కొదవేమీ లేదు. యాక్షన్ ఎంటర్ టైనర్ ని ఫన్నీ వేలో ఎంతో అందంగా మలిచారు. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో జూలై లో విడుదలకు రానుంది. బ్రిటన్ ప్రధానిగా ఇద్రిస్ ఎల్బా నటించగా, అమెరికా అధ్యక్షుడిగా జాన్ సెనా నటించారు.