రాంగ్ టైమ్ లో రీ ఎంట్రీ ఇచ్చిన ప్రేమికుడు

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎండ వేడితో పాటు ఎన్నికల వేడి కొనసాగుతున్న విషయం తెల్సిందే

Update: 2024-05-01 04:33 GMT

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎండ వేడితో పాటు ఎన్నికల వేడి కొనసాగుతున్న విషయం తెల్సిందే. కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తి అయినా కూడా ఫలితాలు రాకపోవడంత ఆ వేడి కొనసాగుతూనే ఉంది. మరో వైపు కొన్ని రాష్ట్రాల్లో రాబోయే రోజుల్లో ఎన్నికలు జరుగబోతున్న నేపథ్యంలో అసలు దేశవ్యాప్తంగా సినిమాల గురించి పట్టించుకుంటున్న నాథుడే లేడు.

ఐపీఎల్‌ మరియు ఎన్నికల దెబ్బతో పెద్ద సినిమాలు ఈ సమ్మర్‌ సీజన్‌ మొత్తంను వదిలేసుకున్నాయి. ఎన్నికలు పూర్తి అయ్యి ఫలితాలు వచ్చిన తర్వాతే తమ సినిమాలను విడుదల చేయాలని భావిస్తున్న నిర్మాతలు ఎంతో మంది ఉన్నారు. అందుకే కొత్త సినిమాలు పెద్దగా ఏమీ రావడం లేదు. వచ్చినా కూడా అలా వచ్చి ఇలా వెళ్తున్నాయి.

కొత్త సినిమాలు, పెద్ద సినిమాలు లేకపోవడంతో పాత సినిమాలు రీ రిలీజ్ కు వస్తున్నాయి. ఇటీవలే తమిళనాట విజయ్ నటించిన గిల్లీ సినిమా రీ రిలీజ్ అయ్యింది. విజయ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్‌ నేపథ్యంలో గిల్లీ ఏకంగా రీ రిలీజ్ లోనూ రూ.20 కోట్ల వసూళ్లు నమోదు చేసింది అనేది బాక్సాఫీస్ వర్గాల మాట.

గిల్లీ ఇచ్చిన జోష్ తో తమిళ హిట్ మూవీ 'కాదలన్‌' రీ రిలీజ్‌ అయ్యింది. తెలుగు లో ఈ సినిమా ప్రేమికుడుగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 30 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమాకు శంకర్‌ దర్శకత్వం వహించగా ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందించాడు. సినిమా మ్యూజికల్‌ గా ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Read more!

మూడు దశాబ్దాలు అయినా కూడా ఇంకా ప్రేమికుడు పాటలు మారుమ్రోగుతూనే ఉంటాయి. అంతటి విజయాన్ని సొంతం చేసుకున్న కాదలన్‌ ను 30 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రీ రిలీజ్‌ చేయడం జరిగింది. రీ రిలీజ్‌ ను భారీ ఎత్తున ప్లాన్‌ చేసిన మేకర్స్ కి షాక్‌ తగిలింది.

బుక్ మై షో లో అనేక షో లు క్యాన్సిల్‌ చేసినట్లుగా పేర్కొనడంతో పాటు అడ్వాన్స్ బుకింగ్‌ కూడా పెద్దగా నమోదు అవ్వలేదు. మేకర్స్ ఆశించిన వసూళ్లలో కనీసం 25 శాతం వసూళ్లు అయినా నమోదు అయ్యేనా అనేది అనుమానమే. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాదలన్‌ విడుదల చేయకుండా ఉండాల్సింది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈతరం యువతకు కూడా కనెక్ట్‌ అయ్యే కాదలన్ ను రాంగ్‌ టైమ్‌ లో రీ రిలీజ్ చేశారు. ఒక మంచి టైమ్‌ లో ఈ సినిమాను మళ్లీ తీసుకు వస్తే బాగుంటుంది అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రభుదేవా ఈ సినిమాతో హీరోగా పరిచయం అవ్వగా నగ్మ హీరోయిన్‌ గా నటించిన విషయం తెల్సిందే.

Tags:    

Similar News