మన ప్రభాస్.. అప్పుడూ ఇప్పుడూ సేమ్ రూట్ లోనే..

టాలీవుడ్ మొత్తంలో వివాదరహితుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభాస్ అని అంతా టక్కున చెబుతారు. ఎందుకంటే ఆయన వివాదాలకు దూరంగా ఉంటారు.;

Update: 2025-05-30 14:30 GMT

టాలీవుడ్ మొత్తంలో వివాదరహితుడు ఎవరైనా ఉన్నారంటే అది ప్రభాస్ అని అంతా టక్కున చెబుతారు. ఎందుకంటే ఆయన వివాదాలకు దూరంగా ఉంటారు. తెలుగు సినీ ఇండస్ట్రీ సెలబ్రిటీలంతా ఆయన స్నేహితులే. ఎవరి వద్ద ప్రభాస్ పేరు ప్రస్తావించినా.. ఆయన మంచితనం గురించి చెబుతూనే ఉంటారు. అలాంటి వ్యక్తిత్వం ఆయనది.

పెద్ద హీరోల.. చిన్న నటుల వరకు అంతా డార్లింగ్ అని పిలుస్తుంటారు. అది మంచితనమనే చెప్పాలి. ఈశ్వర్ మూవీతో కెరీర్ స్టార్ట్ చేసిన ప్రభాస్ ఇప్పటి వరకు ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు.. ఎప్పుడూ వివాదాల్లో కూడా చిక్కుకోలేదు. ఈ విషయం అందరికీ తెలిసిందే.. ఇండస్ట్రీలో ఎవరైనా అదే చెబుతారు.

కానీ రీసెంట్ గా ఆయన మూవీ మాత్రం వివాదంలో చిక్కుకుంది. అదే స్పిరిట్. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. నెవ్వర్ బిఫోర్ క్యారెక్టరైజేషన్ తో సందీప్.. డార్లింగ్ ను చూపించనున్నారని ఇప్పటికే అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఇన్ డైరెక్ట్ గా వంగా కూడా తెలిపారు.

అయితే ఆ సినిమా నుంచి దీపికా పదుకొణెను తప్పించడం.. త్రిప్తి డిమ్రీని హీరోయిన్ గా ఎంపిక చేయడం.. స్టోరీ లీక్ చేస్తున్నారని, డర్టీ పీఆర్ గేమ్స్ అంటూ సందీప్ పోస్ట్ పెట్టడం.. ఈ వ్యవహారం అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఆ విషయంపైనే ఓ రేంజ్ లో పోస్టులు కనిపిస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు బహిరంగంగా ప్రభాస్ స్పందించలేదు.

ఎప్పటిలాగే వివాదాలకు దూరంగా ఉండే ఆయన.. తన వేనే ఫాలో అవుతున్నారు. కానీ ఏం జరిగిందో రీసెంట్ గా ఆరా తీసినట్లు తెలుస్తోంది. సందీప్ రెడ్డితో ఇటీవల మాట్లాడారని తెలుస్తోంది. క్యాస్టింగ్ విషయంలో తాను ఇన్వాల్వ్ కానని చెప్పారని, అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలని ప్రభాస్ చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది.

కాగా, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను సందీప్ రెడ్డి నిర్వహిస్తున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు. అక్టోబర్ లో మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తున్నారు. టీ- సిరీస్ బ్యానర్ పై బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా రూపొందిస్తున్నారు. మరి సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News