స్పిరిట్ నాన్ స్టాప్ గా కుమ్మేయడమే.. రిలీజ్ అప్పుడే

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ కోసం యావత్ సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు.;

Update: 2025-07-26 06:52 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ కోసం యావత్ సినీ ప్రియులు ఎదురుచూస్తున్నారు. సందీప్ గతంలో అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ లాంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించడమే దీనికి ప్రధాన కారణం. అలాగే రెండు దశాబ్దాల ప్రభాస్ కెరీర్ లో తొలి సారి పవర్ఫుల్ పోలీస్ పాత్రలో నటించడం కూడా ఇందుకు మరో రీజన్.

ఇందుకుతోడు సందీప్ తన మాటలతో ఇప్పటికే సినిమాపై అంచనాలు పెంచేశారు. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసి చాలా రోజులు దాటినా, ఇప్పటివరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. అయితే సందీప్ బ్రదర్ ప్రణయ్ రెడ్డి ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ లో స్టార్ట్ అవుతుందని ఇప్పటికే చెప్పారు. ఇక ఇప్పుడు సందీప్ వంతు వచ్చింది. ఆయన స్వయంగా ఈ సినిమాపై అప్డేట్ ఇచ్చారు.

సందీప్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ లీడ్ రోల్ లో నటించిన కింగ్ డమ్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా సందీప్ ను విజయ్ స్పిరిట్ సినిమా గురించి అడిగారు. దీనికి ఆయన రిప్లై ఇచ్చారు. ఈ సినిమా సెప్టెంబర్ ఆఖరి వారంలో సెట్స్ పైకి వెళ్తుందని అన్నారు. అలాగే రెగ్యులర్ షెడ్యూళ్లలో షూటింగ్ ఉంటుంగా అని విజయ్ అడగ్గా.. నాన్ స్టాప్ గా కుమ్మేయడమే అని, షూటింగ్ పూర్తయ్యేదాకా బ్రేక్ పడేదే లేదని సందీప్ సాలీడ్ అప్డేట్ ఇచ్చారు.

అయితే హీరో ప్రభాస్ ను సందీప్ బల్క్ డేట్స్ కావాలని అడిగారట. అలాగే లుక్ రివీల్ అవ్వకుండా ఉండేందుకు ఆయన సినిమా షూటింగ్ జరుగుతుండగా వేరే ప్రాజెక్ట్ లతో ట్రావెల్ అవ్వకూడదని రిక్వెస్ట్ చేశారట. దీనికి ప్రభాస్ కూడా ఓకే చెప్పారట. ప్రస్తుతం రాజాసాబ్, ఫౌజీ సినిమాలు చేస్తున్నందున సెప్టెంబర్ దాకా వెయిట్ చేయాని ప్రభాస్ చెప్పారట. అందుకే అటు సందీప్ కూడా సెప్టెంబర్ దాకా ఆగుతున్నారు.

ఈలోగా ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ సినిమాలు పూర్తి చేస్తారు. ఆ తర్వాత స్పిరిట్ మొదలవుతుంది. ప్రస్తుతం సందీప్ స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బజీగా ఉన్నారు. ఇంకో నెలలోపు ఇవన్నీ కంప్లీట్ చేసి ప్రాజెక్ట్ ను పట్టాలెక్కియనున్నారు. అయితే సందీప్ చెప్పినదాని బట్టి చూస్తే, ఒక ఏడాదిలో ఈ సినిమా కంప్లీట్ అవ్వొచ్చు. పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ కలుపితే వచ్చే ఏడాది చివరి వరకు స్పిరిట్ పూర్తయ్యే ఛాన్స్ ఉంది. అలాగే 2026 ఆఖర్లో, లేదా 2027 తొలి అర్థ భాగంలో ఇధి థియేటర్లలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Tags:    

Similar News