సెల్ఫీ వీడియోలో హీరోని హీరోయిన్ మాస్ ర్యాగింగ్..!
బుట్ట బొమ్మ పూజా హెగ్దే సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అక్కడ ఇక్కడ సందడి చేస్తుంది.;
బుట్ట బొమ్మ పూజా హెగ్దే సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అక్కడ ఇక్కడ సందడి చేస్తుంది. ఐతే సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా కూడా అమ్మడు అవకాశాలైతే అందుకుంటుంది. త్వరలో సూర్య రెట్రో సినిమాతో రాబోతున్న పూజా హెగ్దే బాలీవుడ్ లో వరుణ్ ధావన్ తో ఒక సినిమా చేయబోతుంది. డేవిడ్ ధావన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హే జవాని తో ఇష్క్ హోనా హై సినిమాలో వరుణ్ ధావన్, పూజా హెగ్దే కలిసి నటిస్తున్నారు.
ఇదిలా ఉంటే అనుకోకుండా ఎయిర్ పోర్ట్ లో వరుణ్ ధావన్ ని పూజా హెగ్దే కలిసింది. ఆ టైం లో వరుణ్ ధావన్ ని పూజా హెగ్దే సరదాగా ఆట పట్టించింది. బిజీ ఆర్టిస్ట్ అని.. 500 మిస్డ్ కాల్స్ ఉన్నాయంటూ వరుణ్ ధావన్ ని పొగడ్తలతో ముంచెత్తింది పూజా హెగ్దే. ఆమె సరదాగానే అంటున్నా ఆమె చేస్తున్న ఈ ర్యాగింగ్ కి వరుణ్ ధావన్ కూడా ఎంజాయ్ చేశాడు.
డేవిడ్ ధావన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హే జవాని తో ఇష్క్ హోనా హై సినిమాలో ఈ ఇద్దరి పెయిర్ అదిరిపోతుంది అనిపిస్తుంది. ఎప్పుడైనా హీరో హీరోయిన్ ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంది అనిపిస్తుందో అప్పుడు ఆన్ స్క్రీన్ పై వాళ్ల పెయిర్ సూపర్ అనిపిస్తుంది. బాలీవుడ్ లో ఫలితాలతో సంబంధం లేకుండా వరుణ్ ధావన్ వరుస ప్రాజెక్ట్ లు చేసుకుంటూ వెళ్తున్నాడు. సినిమాలే కాదు వెబ్ సీరీస్ లతో కూడా అలరిస్తున్నాడు వరుణ్ ధావన్.
సమంతతో అతను చేసిన సిటాడెల్ సీరీస్ సూపర్ హిట్ అయ్యింది. ఐతే కెరీర్ లో ఫస్ట్ టైం పూజా హెగ్దే తో కలిసి నటిస్తున్నాడు వరుణ్ ధావన్. అందుకే ఈ సినిమా మీద సూపర్ కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు. పూజా హెగ్దే ఈమధ్యనే షాహిద్ కపూర్ తో దేవా సినిమా చేసింది. ఐతే ఆ సినిమా అంతగా వర్క్ అవుట్ కాలేదు. ఐతే వరుణ్ సినిమాతో బీ టౌన్ లో హిట్ కొట్టాలని చూస్తుంది అమ్మడు. సౌత్ లో ముఖ్యంగా తెలుగులో సినిమాలు చేయాలని అనుకుంటున్నా కూడా పూజా హెగ్దేకి పెద్దగా అవకాశాలు రావట్లేదు. ఐతే ఓ తెలుగు సినిమాకు సైన్ చేశా కానీ ఆ మేకర్స్ అనౌన్స్ చేసే వరకు అది సస్పెన్స్ అంటుంది పూజా బేబీ. మరి ఆ సినిమా ఏదన్నది తెలుసుకోవాలని పూజా హెగ్దే తెలుగు ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు.