పెద్ది మూవీ రివ్యూ
పెద్ది మూవీ రివ్యూ
ఆటగాళ్ల కంటే ఆట గొప్పది అని అంటారు. కానీ ‘పెద్ది’ చూస్తున్నప్పుడు మాత్రం ఆటగాడే ఆటను మించి కనిపిస్తాడు. ఒకే సినిమాలో మూడు విభిన్న క్రీడల్లో తన ముద్ర వేసే ‘క్రాస్ ఓవర్’ అథ్లెట్‌గా పెద్ది పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా కుస్తీ ఎపిసోడ్స్ థియేటర్లలో మంచి హైని తీసుకొస్తాయి.
పెద్ది అనే పాత్రను అంత ఎత్తులో నిలబెట్టిన ఘనత ముందుగా రామ్ చరణ్‌కే చెందుతుంది. పాత్ర కోసం ఆయన చూపించిన అంకితభావం, బాడీ లాంగ్వేజ్, ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ఈ పాత్రను ప్రత్యేకంగా నిలబెడతాయి. ఒక నటుడు పాత్రను పూర్తిగా ఓన్ చేసుకుంటే ప్రేక్షకులపై ఎంతటి ప్రభావం చూపగలడో ‘పెద్ది’ మరోసారి నిరూపిస్తుంది.
దర్శకుడు బుచ్చిబాబు ఎంచుకున్న కథలో బలమైన భావోద్వేగాలు, స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్, కమర్షియల్ అంశాలు ఉన్నాయి. అయితే కథలో ఉన్న గొప్పతనం మొత్తం తెరపై అదే స్థాయిలో అనువదించబడిందా అంటే కొంత చర్చకు తావుంది. మూడు క్రీడలను ఒకే కథలో మిళితం చేసే ప్రయత్నం ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో ఆటల కంటే పెద్ది పాత్రే ఎక్కువగా హైలైట్ అవుతుంది.
అయినా కథ ఎక్కడా ఆగిపోయిన భావన కలగకుండా ముందుకు సాగుతుంది. మూడు గంటలకు పైగా నిడివి ఉన్నప్పటికీ బోర్ కొట్టించే మూమెంట్స్ పెద్దగా లేకపోవడం సినిమాకు ప్లస్. భావోద్వేగాలు, మాస్ మూమెంట్స్, స్పోర్ట్స్ స్పిరిట్ కలగలిసి ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి.
టీమ్ ప్రచారం చేసిన స్థాయిలో ఇది ఒక మాస్టర్‌పీస్‌గా నిలుస్తుందా అన్నది ప్రేక్షకుల అభిప్రాయంపై ఆధారపడి ఉంటుంది. కానీ ‘పెద్ది’గా రామ్ చరణ్ చూపించిన నటన, స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం చాలా కాలం గుర్తుండిపోతాయి.
Bottom Line: కొన్ని లోపాలు ఉన్నా వాటిని అధిగమించే స్థాయిలో రామ్ చరణ్ ‘పెద్ది’ పాత్ర నిలుస్తుంది. బలమైన పెర్ఫార్మెన్స్‌లు, ఎమోషన్స్, స్పోర్ట్స్ డ్రామాను ఆస్వాదించాలనుకునేవారికి ‘పెద్ది’ మంచి థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్.
పూర్తి సమీక్షతో మళ్లీ కలుద్దాం... త్వరలో!