నట వారసురాలు సింగిలే అంటున్నా మింగిలే!

సింగిల్‌గా ఉన్నానని పాల‌క్ చెబుతున్నా.. బయట జరుగుతున్న ప్రచారం మాత్రం అందుకు భిన్నంగా ఉండటంతో నెటిజన్లు ఆసక్తికర చర్చ మొదలుపెట్టారు.;

Update: 2026-05-06 18:30 GMT

టెలివిజన్ స్టార్ నటి శ్వేతా తివారీ నట వారసురాలిగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన పాలక్ తివారీ ప్రస్తుతం తన సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతోనే సోషల్ మీడియాలో ఎక్కువగా లైమ్‌లైట్‌లో ఉంటోంది. తన అందచందాలతో కుర్రకారును ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ తాజాగా తన రిలేషన్‌షిప్ స్టేటస్‌పై స్పందించి అందరినీ ఆశ్చర్యపరిచింది. సింగిల్‌గా ఉన్నానని పాల‌క్ చెబుతున్నా.. బయట జరుగుతున్న ప్రచారం మాత్రం అందుకు భిన్నంగా ఉండటంతో నెటిజన్లు ఆసక్తికర చర్చ మొదలుపెట్టారు.

ప్రముఖ యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాలక్ తివారీ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తాను ప్రస్తుతం `సింగిల్`గానే ఉన్నానని స్పష్టంగా వెల్లడించారు. అయితే సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం అలీ ఖాన్‌తో పాలక్ ప్రేమలో ఉన్నట్లు గత కొంతకాలంగా బాలీవుడ్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. పలుమార్లు వీరిద్దరూ జంటగా కెమెరా కంటికి చిక్కినా పాలక్ మాత్రం తనకు ఎవరితోనూ మొహబ్బత్ లేదని చెప్పడం గమనార్హం.

పాలక్ చేసిన ఈ `సింగిల్` కామెంట్ సోషల్ మీడియా సెలబ్రిటీ ఓరీని కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. ఆమె ఇంటర్వ్యూ క్లిప్‌పై ఓరీ స్పందిస్తూ..`ఆమె సింగిలా???` అంటూ పెట్టిన కామెంట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. గతంలో పాలక్, ఓరీల మధ్య జరిగిన వాట్సాప్ చాట్స్ లీక్ అయ్యి పెద్ద దుమారమే రేపాయి. ముఖ్యంగా సారా అలీ ఖాన్ ప్రస్తావన ఉన్న ఆ చాట్స్ కారణంగా వీరి మధ్య కొంత విభేదాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఓరీ స్పందించడం పబ్లిసిటీ స్టంట్ అని కొందరు భావిస్తున్నారు.

ఇటీవ‌ల‌ పాల‌క్ రణవీర్ అల్లాబాడియాతో ముచ్చటించారు. తన టీనేజ్ రోజుల్లో మాజీ ప్రియుడితో జరిగిన చిన్న చిన్న గొడవలు, బస్సు మిస్సయిన సందర్భాల గురించి పాలక్ సరదాగా చెప్పుకొచ్చారు. త‌న‌ వృత్తిపరమైన సినిమా విశేషాల కంటే... రిలేషన్‌షిప్ స్టేటస్ .. ఓరీ చేసిన రియాక్షన్‌పైనే సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చ సాగుతోంది.

మరోవైపు పాలక్ నటించిన తాజా చిత్రం `లుఖే` సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సిరీస్ లో న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న పాత్ర‌లో పాల‌క్ న‌టించింది. తన తల్లి శ్వేతా తివారీ మాదిరిగానే నటనలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న పాలక్ ఇలాంటి గాసిప్స్.. వైరల్ వార్తలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తోంది. ఇబ్రహీం అలీ ఖాన్‌తో డేటింగ్ వార్తలకు పాలక్ సమాధానం నేను సింగిలే. కానీ భవిష్యత్తులో ఈ పటౌడీ వారసుడితో బంధం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

పలక్ తివారీ ఒక ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టబోతున్నట్లు గ‌తంలో క‌థ‌నాలొచ్చాయి. ముఖ్యంగా ఒక యువ స్టార్ హీరో సరసన ఆమెను కథానాయికగా ఎంపిక చేసేందుకు చర్చలు జరుగుతున్నట్లు ప్ర‌చార‌మైనా ఆ త‌ర్వాత దానికి సంబంధించిన అప్ డేట్ రాలేదు. ర‌వీనా టాండ‌న్ న‌టవారసురాలు రాషా త‌డానీ త‌ర్వాత శ్వేతాతివారీ గారాల పుత్రిక టాలీవుడ్ లో డెబ్యూ ఇవ్వ‌డానికి కొంత స‌మ‌యం ప‌ట్టొచ్చు.

Tags:    

Similar News