స్టార్ హీరోకి మాతృవియోగం
నిర్మల్ దివంగత ఫిలింమేకర్ సురీందర్ కపూర్ భార్య. నలుగురు పిల్లలకు తల్లి. బోనీ, అనీల్, సంజయ్, రీనా కపూర్ మార్వా వారసులు.;
కపూర్ బ్రదర్స్ అనిల్ కపూర్, సంజయ్ కపూర్, బోనీ కపూర్ ల తల్లి నిర్మల్ కపూర్ శుక్రవారం ముంబైలో కన్నుమూశారు. ఆమెకు 90 సంవత్సరాలు. ఈ వార్త తెలిసిన కొద్దిసేపటికే బోనీ తన తల్లి ఇంటికి వస్తున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. గత సంవత్సరం సెప్టెంబర్ లో నిర్మల్ 90వ పుట్టినరోజును కుటుంబ సభ్యులు సెలబ్రేట్ చేసారు.
నిర్మల్ దివంగత ఫిలింమేకర్ సురీందర్ కపూర్ భార్య. నలుగురు పిల్లలకు తల్లి. బోనీ, అనీల్, సంజయ్, రీనా కపూర్ మార్వా వారసులు. అర్జున్ కపూర్, సోనమ్ కపూర్, రియా కపూర్, హర్ష్ వర్ధన్ కపూర్, జాన్వీ కపూర్, అన్షులా కపూర్, ఖుషీ కపూర్, మోహిత్ మార్వా వంటి నటీనటులకు నానమ్మ/అమ్మమ్మ కూడా.
అనిల్ తన తల్లికి శుభాకాంక్షలు చెబుతూ... ఆమెతో ఉన్న రెండు ఫోటోలను షేర్ చేసాడు. 90 సంవత్సరాల ప్రేమ, బలం.. అంతులేని త్యాగాలు... మీ ఉనికి ప్రతిరోజూ మా జీవితాలను ఆనందం, సానుకూలతతో నింపుతుంది.. అని రాసారు.