వాళ్ల తర్వాత పాన్ ఇండియా రేంజ్ ఎవరిందంటే?
టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్లు అంటే గుర్తొచ్చేది నలుగురే. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ లు మాత్రమే.;
టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్లు అంటే గుర్తొచ్చేది నలుగురే. ప్రభాస్, రామ్ చరణ్, ఎన్టీఆర్, బన్నీ లు మాత్రమే. ఈ నలుగురే పాన్ ఇండియాలో మార్కెట్ ఉన్న హీరోలు. `కార్తికేయ2` తో నిఖిల్, హనుమాన్ సినిమాతో తేజ సజ్జా లాంటి వారు పాన్ ఇండియాకి పరిచయమైనా ఇంకా వాళ్లకు అంత క్రేజ్ లేదు. పాన్ ఇండియాలో వాళ్ల సినిమాలు మంచి వసూళ్లను సాధించినా? మార్కెట్ పరంగా స్ట్రాంగ్ గా లేరు.
వాళ్ల మార్కెట్ స్థిరంగా ఉండదు. కార్తికేయ 2 తర్వాత నిఖిల్ నటించిన సినిమాలు రీజన్ మార్కెట్ లో కూడా వర్కౌట్ అవ్వలేదు. నటుల మధ్య ఇలాంటి వ్యత్యాసాలుంటాయి. ఆ కారణంగా పాన్ ఇండియా స్టార్ డమ్ అన్నది అందరికీ సాధ్యం కాదు. కానీ ఆ నలుగురు తర్వా త పాన్ ఇండియాలో ఫేమస్ అయ్యేది ఎవరు? అంటే ప్రముఖంగా ముగ్గురు హీరోల పేర్లు తెరపైకి వస్తున్నాయి. వాళ్లే నాని, విజయ్ దేరకొండ, నాగచైతన్య.
నేచురల్ స్టార్ నాని కి ఆ ఛాన్స్ ఎక్కువగా ఉంది. `దసరా`తో ఆ రకమైన అటెంప్ట్ చేసినా పాన్ ఇండియా లో వర్కౌట్ అవ్వలేదు. రీజనల్ మార్కెట్ లోనే ఆ సినిమా మంచి విజయం సాధించింది. విజయ్ దేవరకొండ కూడా `లైగర్` తో ఇండియాలోకి వెళ్లాడు. భారీ అంచనాల మధ్య చేసిన సినిమా దారుణమైన ఫలితాన్ని చూసింది. నాగచైతన్య చేసిన తొలి పాన్ఇండియా చిత్రం `తండేల్` బాగానే నెట్టుకొచ్చింది. ఈ సినిమాతో చైతన్య 100 కోట్ల క్లబ్ లో చేరాడు.
ప్రస్తుతం ఈ ముగ్గురు హీరోలు భారీ ఎత్తున పాన్ ఇండియా చిత్రాలు ప్లాన్ చేస్తున్నారు. నాని ప్యారడైజ్ తో పాన్ ఇండియాలో హిట్ ఖాయం అనే నమ్మకంతో ఉన్నాడు. అతడు నేచురల్ పెర్పార్మెన్స్ తో ఇండియా ని షేక్ చేస్తాడు? అన్న అంచనాలున్నాయి. దేవరకొండ `అర్జున్ రెడ్డి`తో నార్త్ మార్కెట్ లో వెలిగిపోయాడు. సరైన హిట్ పడితే నార్త్ లో విజయ్ కి తిరుగుండదు. హిందీ హీరోలకే పోటీగా మారుతాడు. అక్కినేని వారసుడు కూడా యూనిక్ సబ్జెక్ట్ లను ఎంచుకుంటున్నాడు. అతడలో ఆక్వాలిటీనే ఆ రేంజ్ కి తీసుకెళ్తుందని అంచనాలున్నాయి.