నందన్ రామ నారా.. పేరులోనే ఎమోషన్!
తమ కొడుక్కి నందన్ రామ నారా అనే పేరును పెట్టినట్లు తెలిపారు. అయితే ఈ పేరు వెనుక కేవలం అందమైన అర్థమే కాదు.. ఫ్యామిలీతో ముడిపడిన స్పెషల్ ఎమోషన్ కూడా ఉంది.
టాలీవుడ్ హీరో నారా రోహిత్, సిరి లేల్ల దంపతులు తమ కొడుకుని మొదటిసారి ప్రపంచానికి పరిచయం చేశారు. జూన్‌లో తమ జీవితాల్లోకి అడుగుపెట్టిన బిడ్డను ఇన్నాళ్లు తమకే పరిమితం చేసిన ఈ దంపతులు.. తాజాగా ఫ్యామిలీతో కలిసి ఉన్న అందమైన ఫొటోను షేర్ చేస్తూ కొడుకు పేరును అఫీషియల్ గా వెల్లడించారు. తమ కొడుక్కి నందన్ రామ నారా అనే పేరును పెట్టినట్లు తెలిపారు. అయితే ఈ పేరు వెనుక కేవలం అందమైన అర్థమే కాదు.. ఫ్యామిలీతో ముడిపడిన స్పెషల్ ఎమోషన్ కూడా ఉంది.
నందన్ అనే పేరుకు అపారమైన ఆనందాన్ని, సంతోషాన్ని తీసుకొచ్చేవాడు అనే అర్థం వస్తుంది. తమ జీవితాల్లోకి వచ్చిన బిడ్డను తల్లిదండ్రులు ఎంతటి గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నారో ఈ పేరులోనే చెప్పే ప్రయత్నం చేశారు. కొడుకు తమ కుటుంబంలో తీసుకొచ్చిన ఆనందాన్ని నేరుగా కొడుకు పేరుతో ముడిపెట్టడం ఇందులో ప్రత్యేకతగా కనిపిస్తోంది. అందుకే నందన్ అనే పేరు కేవలం వినడానికి బాగుండే పేరుగా కాకుండా.. తమ జీవితాల్లో బిడ్డ రాకను ప్రతిబింబించే పేరుగా మారింది.
ఇక రామ అనే పేరు మాత్రం ఈ కథలో మరో ముఖ్యమైన ఎమోషన్ ను తీసుకొస్తోంది. ఈ పేరును పిల్లాడి తాతగారైన రామ మూర్తి నాయుడు గారి గౌరవార్థం ప్రేమతో కొనసాగించినట్లు రోహిత్ వెల్లడించారు. అంటే నారా రోహిత్ తన కొడుక్కిపేరు పెట్టే విషయంలో కేవలం ప్రస్తుత తరాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకోలేదు. తమ ఫ్యామిలీలో ఇప్పటికే ఉన్న ఒక బాండింగ్‌ను, ఒక జ్ఞాపకాన్ని కూడా తన కొడుకు పేరులో భాగం చేశారు. దీంతో రామ అనే పేరు తాత నుంచి మనవడికి చేరిన కుటుంబ వారసత్వానికి గుర్తుగా నిలిచింది.
సాధారణంగా పిల్లలకు పేరు పెట్టేటప్పుడు కొత్తదనం, ప్రత్యేకత కోసం తల్లిదండ్రులు ఆలోచిస్తుంటారు. కానీ నారా రోహిత్, సిరి లేల్ల సెలెక్షన్ లో కొత్తదనంతో పాటు ఫ్యామిలీ ఎమోషన్ కు కూడా ప్రాధాన్యం కనిపిస్తోంది. నందన్ అనే పేరులో తమ బిడ్డ తీసుకొచ్చిన ఆనందం ఉంటే.. రామ లో తరాల అనుబంధం కనిపిస్తోంది. అందుకే నందన్ రామ నారా అనే పేరు చిన్నదిగా అనిపించినా.. దాని వెనుక ఉన్న కథ మాత్రం కుటుంబ ప్రేమ, జ్ఞాపకం, వారసత్వంతో నిండిపోయింది.
తమ కొడుకుని ప్రపంచానికి పరిచయం చేస్తూ నారా రోహిత్ దంపతులు అతడిని తమ గొప్ప ఆశీర్వాదంగా అభివర్ణించారు. దీంతో పేరు మాత్రమే కాదు.. ఆ పేరును ఎంచుకున్న విధానం కూడా అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. తాతగారి జ్ఞాపకాన్ని మనవడి పేరుతో ముందుకు తీసుకెళ్లడం ద్వారా కుటుంబ బంధానికి నారా రోహిత్ ఇచ్చిన ప్రాధాన్యం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.