అన్ స్టాపబుల్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..!
ఓటీటీలో వచ్చిన సూపర్ హిట్ చిట్ చాట్ షోస్ లో అన్ స్టాపబుల్ టాప్ ప్లేస్ సంపాదించుకుంది.;
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా మారి చేసిన స్పెషల్ షో అన్ స్టాపబుల్. ఈ షో ముందు బాలయ్య మీద ఉన్న ఒపీనియన్ ఒకటైతే షో చూశాక బాలయ్య ఇంత సరదాగా ఉంటారా అన్న ఆలోచన ఆడియన్స్ లో కలిగింది. షోకి వచ్చిన గెస్ట్ లతో బాలకృష్ణ సరదా సంభాషణలు.. ఆయన వేసే పంచులు.. ఆయన ముక్కు సూటితనం అన్నీ ఆడియన్స్ కి బాగా నచ్చేశాయి. అందుకే ఆఫ్టర్ అన్ స్టాపబుల్ సినిమాల్లో కూడా ఆయన దూసుకెళ్తున్నారు. అన్ స్టాపబుల్ షో ఆహా ఏ ముహుర్తాన మొదలు పెట్టిందో కానీ ఆ షో సూపర్ హిట్ అయ్యింది.
హోస్ట్ గా బాలయ్య..
ఓటీటీలో వచ్చిన సూపర్ హిట్ చిట్ చాట్ షోస్ లో అన్ స్టాపబుల్ టాప్ ప్లేస్ సంపాదించుకుంది. ఈ షో వల్ల బాలయ్య ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అయ్యారు. ఐతే ఇప్పటికే 3 సీజన్లు పూర్తి చేసుకున్న అన్ స్టాపబుల్ సీజన్ 4 కి రెడీ ఎప్పుడు అంటూ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అన్ స్టాపబుల్ హోస్ట్ గా బాలయ్యని చూడాలని ఫ్యాన్స్ ఉత్సాహపడుతున్నారు. కానీ అన్ స్టాపబుల్ సీజన్ 4 కాస్త టైం పట్టేలా ఉందని తెలుస్తుంది.
ప్రస్తుతం బాలకృష్ణ తన సినిమాలను పూర్తి చేసే పనుల్లోనే ఉన్నారు. మరోపక్క పొలిటికల్ గా కూడా బిజీగా ఉన్నారు. సో ఈ రెండిటినే బ్యాలెన్స్ చేయడానికి టైం సరిపోవట్లేదు. అదీగాక అఖండ 2 పూర్తి చేసి నెక్స్ట్ బాలయ్య రెండు సినిమాలను ఒకేసారి సెట్స్ మీదకు తీసుకెళ్తున్నారు. సో ఆ రెండు సినిమాలను పూర్తి చేస్తే కానీ బాలయ్య ఫ్రీ అయ్యే ఛాన్స్ లేదు. బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో ఒక సినిమా.. క్రిష్ డైరెక్షన్ లో ఆదిత్య 999 సినిమా ఒకటి చేస్తున్నారు.
అన్ స్టాపబుల్ సీజన్ 4..
ఈ రెండు సినిమాలు పూర్తి చేశాక బాలకృష్ణ అన్ స్టాపబుల్ కి టైం ఇవ్వాల్సి ఉంటుంది. సో చూస్తుంటే ఈ ఇయర్ అన్ స్టాపబుల్ షో ఉండే ఛాన్స్ కనిపించట్లేదు. అన్ స్టాపబుల్ షో సీజన్ 4 వస్తుందని ఆహా అంతకుముందే అనౌన్స్ చేసింది కానీ.. ఇప్పటివరకు అది మొదలు పెట్టలేదు. చూస్తుంటే ఈ ఇయర్ అన్ స్టాపబుల్ షోకి ఛాన్స్ లేదనే అనిపిస్తుంది. అన్ స్టాపబుల్ సీజన్ 4 లో ఎప్పుడొస్తుంది. అందులో ఎవరెవరు గెస్ట్ గా వస్తారంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు.
బాలయ్య అఖండ 2 సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. సెప్టెంబర్ 25న రిలీజ్ అనుకున్న ఈ సినిమా కాస్త డిసెంబర్ కి వాయిదా పడుతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాతో బాలయ్య పాన్ ఇండియా అటెంప్ట్ చేస్తున్నారు.