రైస్ విత్ ఐస్ క్రీమ్.. ఆ మజాయే వేరంటున్న స్టార్ హీరోయిన్!

మృణాల్ తన నటన ప్రస్తానాన్ని సీరియల్ ద్వారా మొదలుపెట్టింది. ఆ తర్వాత 2014లో వచ్చిన విట్టి దండు అనే మరాఠీ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Update: 2026-06-04 16:30 GMT

కొంతమందికి ఊహించని ఆహారపు కాంబినేషన్లు ఇష్టంగా మారుతూ ఉంటాయి. సాధారణంగా వారి ఆహారపు అలవాట్లు ఎదుటి వారికి ఆశ్చర్యంగా అనిపించినా.. ట్రై చేస్తే తప్పకుండా మీరు కూడా ఇష్టపడతారు అంటూ కొంతమంది సెలబ్రిటీలు చెబుతూ ఉంటారు. కొంతమందికి కాఫీలోకి పల్లీలు వేసుకుని తినడం ఇష్టమైతే.. మరికొంతమందికి అదే కాఫీలోకి ఇడ్లీ అద్దుకొని తినడం ఇష్టం.. ఇలా ఎవరికి వారు తమ ఇష్టాలను బయటపెడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక హీరోయిన్ ఏకంగా రైస్ తో ఐస్ క్రీమ్ కలిపి తీసుకోవడం ఇష్టం అని.. అలా తింటే ఆ మజాయే వేరు అని చెబుతోంది. మరి ఆమె ఎవరో? ఆమెకు ఈ అలవాటు ఎప్పుడు? ఎక్కడ? ఎలా వచ్చిందో ? మనం ఒకసారి చూద్దాం.

ఐస్ క్రీమ్ తో అన్నం..

ఆమె ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ బాలీవుడ్ మొదలుకొని టాలీవుడ్ వరకు పలు చిత్రాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె.. ఇటీవల ఒకానొక సందర్భంలో ఇలా ఐస్ క్రీమ్ తో రైస్ కలిపి తీసుకోవడం గురించి మాట్లాడింది. మృణాల్ మాట్లాడుతూ.." నేను ఒకసారి నా ఫ్రెండ్ ఐస్ క్రీమ్ తో రైస్ కలుపుకొని తింటూ ఎంజాయ్ చేయడం చూసి.. నేను కూడా ట్రై చేశాను. అలా ఐస్ క్రీమ్, రైస్ కలిపి తింటే ఆ టేస్ట్ చాలా కొత్తగా, భిన్నంగా అద్భుతంగా ఉంది" అంటూ చెప్పుకొచ్చింది . మొత్తానికైతే మృణాల్ ఠాకూర్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటే.. ఐస్ క్రీమ్ తో అన్నం కలుపుకొని తినడం ఏంటి అంటూ కొంతమంది ఆశ్చర్యంగా కామెంట్ చేస్తున్నారు. మరి కొంతమంది మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు అంటూ ట్రై చేస్తున్నట్లు సమాచారం.

సీరియల్ నుండి సినిమా వరకు.. మృణాల్ కెరియర్..

మృణాల్ తన నటన ప్రస్తానాన్ని సీరియల్ ద్వారా మొదలుపెట్టింది. ఆ తర్వాత 2014లో వచ్చిన విట్టి దండు అనే మరాఠీ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

తెలుగులో మాత్రం సీతారామం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఈమెకు ఊహించని విజయాన్ని అందించింది. మొదటి సినిమాతోనే సీతామహాలక్ష్మి పాత్రతో చూపరుల దృష్టిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ.

డెకాయిట్ తో మళ్లీ నిలబడ్డ మృణాల్..

సీతారామం సినిమా తర్వాత హాయ్ నాన్న సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్న ఈమె.. ఆ తర్వాత ది ఫ్యామిలీ స్టార్ సినిమాతో డిజాస్టర్ ను చవిచూసింది. ఈ సినిమా ఫలితంతో మళ్లీ ఈమెకు అవకాశం లభించలేదు. అయితే డెకాయిట్ సినిమాలో శృతిహాసన్ వల్లే ఈమెకు అవకాశం లభించింది. అడివి శేష్ హీరోగా నటించిన ఈ సినిమాలో మొదట శృతిహాసన్ హీరోయిన్ గా ఎంపికయింది. కొంత భాగం షూటింగ్ అయిన తర్వాత కొన్ని కారణాల వల్ల సినిమా నుండి తప్పుకోవడంతో ఆ స్థానంలోకి ఈమె వచ్చి చేరింది. ఇందులో తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకర్షించింది ఈ ముద్దుగుమ్మ.

మృణాల్ ప్రస్తుత సినిమాలు..

ఇక ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న రాకా సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే హిందీలో హై జవానీతో ఇష్క్ హోనా హై అనే సినిమాలో కూడా నటించింది ఈ ముద్దుగుమ్మ . ఇక ప్రస్తుతం పూజా మేరీ జాన్ అనే మరో హిందీ చిత్రంలో నటిస్తోంది.

Tags:    

Similar News