మృణాల్ సోషల్ మీడియా ఆర్జన ఆ రేంజులో
తక్కువ సమయంలోనే టాలీవుడ్, బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన మృణాల్ ఠాకూర్ పాపులారిటీ రోజురోజుకూ పెరిగిపోతోంది.
టెలివిజన్ రంగం నుంచి సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి.. తక్కువ సమయంలోనే టాలీవుడ్, బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఎదిగిన మృణాల్ ఠాకూర్ పాపులారిటీ రోజురోజుకూ పెరిగిపోతోంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్‌లో ఏకంగా 1 కోటి 62 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఈ భారీ ఫాలోయింగ్ కారణంగా ఈ భామ సోషల్ మీడియా వేదికగా సంపాదిస్తున్న మొత్తం ఎంతో తెలిస్తే ఆశ్చర్యం కలగక మానదు. కేవలం సినిమాల ద్వారానే కాకుండా.. బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, పెయిడ్ ప్రమోషన్ల ద్వారా డిజిటల్ ప్రపంచంలోనూ భారీగా ఆర్జిస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రముఖ బ్రాండ్ల ప్రమోషన్స్ కి ఒక్కో పెయిడ్ అడ్వర్‌టైజ్‌మెంట్ పోస్ట్‌కు లేదా స్పాన్సర్‌షిప్ వీడియోకు సుమారు రూ. 15 లక్షల నుండి రూ. 30 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు సమాచారం. ఇలా కేవలం సోషల్ మీడియా ప్రకటనల ద్వారానే నెలకు కోట్లలో కాకపోయినా లక్షల్లో స్థిరమైన ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. `సీతారామం`, `హాయ్ నాన్న`వంటి వరుస విజయాల తర్వాత తన పారితోషికాన్ని భారీగా పెంచేశారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు సుమారు రూ. 2 కోట్ల నుండి రూ. 2.5 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటూ అగ్ర నాయికల సరసన దూసుకెళుతున్నారు.
అయితే ఇలీవల ఫ్యామిలీ స్టార్, డకోయిట్ చిత్రాల పరాజయాలు .. అంతగా కలిసి రాని `కల్కి 2898 AD`లో చిన్న రోల్ కొంత ఇబ్బందికరం. ఇలాంటి సమయంలో అల్లు అర్జున్ - అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న భారీ చిత్రం రాకాలో పాత్ర ఆదుకుంటుందని మృణాల్ భావిస్తోంది.
అయితే ఇప్పుడు స్టార్ స్టాటస్ గ్రాఫ్ ని పైకి తీసుకెళ్లాల్సిన సమయం కాబట్టి ఆచితూచి అడుగులు వేస్తోంది. మరోవైపు మృణాల్ కేవలం వెండితెరపైనే కాకుండా డిజిటల్ మాధ్యమాలలోనూ తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నారు. విభిన్న బ్రాండ్ల ప్రమోషన్లతో సోషల్ మీడియా ద్వారా ఆర్జిస్తున్న మొత్తం నిజంగా ఆశ్చర్యపరుస్తోంది. నటిగా అటు సినిమా ఆఫర్లతో పాటు ఇటు గ్లామర్ వరల్డ్‌లోనూ తన క్రేజ్‌ను క్యాష్ చేసుకుంటోంది. ఈ డిజిటల్ జోరు ఆర్థికంగా నిలబెడుతోంది.
భవిష్యత్తులో తన తదుపరి సినిమాల విజయాలు కీలకం. ముఖ్యంగా భారీ ప్రాజెక్ట్‌ల ఫలితాలు కెరీర్‌ను మరింత ముందుకు తీసుకువెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తాయి. సోషల్ మీడియా సంపాదనతో పాటు సినిమా రెమ్యునరేషన్ల పరంగానూ ఒక రేంజు చూపిస్తున్న మృణాల్ మునుముందు రోజుల్లో తన స్థానాన్ని మరింతగా సుస్థిరం చేసుకుంటుందేమో చూడాలి.