మోహ‌న్‌లాల్ టీమ్ బ్లండ‌ర్ మిస్టేక్

ఈ క్రమంలో కర్ణాటక మంత్రి బీజడ్‌ జమీర్‌ అహ్మద్‌ఖాన్‌ చేసిన కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.;

Update: 2025-05-03 11:30 GMT

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో టూరిస్టుల పై జరిగిన హృదయ విదారక ఉగ్రదాడితో భారత్-పాకిస్తాన్ సంబంధాలు మరింత దిగజారాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలనే డిమాండ్లు దేశవ్యాప్తంగా బలంగా వస్తున్నాయి. ఈ క్రమంలో కర్ణాటక మంత్రి బీజడ్‌ జమీర్‌ అహ్మద్‌ఖాన్‌ చేసిన కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పాక్‌పై పోరాటానికి ఆత్మాహుతి బాంబు ఇస్తే తాను సిద్ధంగా ఉన్నానంటూ ఆయన సంచలన ప్రకటన చేశారు.

"పాకిస్తాన్ ఎప్పటికీ భారతదేశానికి శత్రుదేశమే. ఆ దేశంతో మనకు ఎలాంటి సంబంధాలు భవిష్యత్ లో కూడా ఉండకూడదు. ప్రధానమంత్రి మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా గనుక అంగీకరిస్తే, ఆ దేశంపై యుద్దం చేసేందుకు నేను రెడీ. ఆత్మాహుతి దాడి కోసం నాకు ఒక బాంబు ఇవ్వండి" అంటూ మంత్రి జమీర్ అహ్మద్ ఖాన్ అన్నారు. అంతకుముందు కూడా ఆయన పహల్గాం దాడిని తీవ్రంగా ఖండించారు. ఇది అత్యంత హేయమైన చర్య అని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటానికి మనమందరం ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

ఇది ఇలా ఉంటే పాక్ భూభాగంపై భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్‌పై కాంగ్రెస్ ఎంపీ చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీ అనుమానాలు వ్యక్తం చేశారు. ఆ దాడులకు సంబంధించిన ఆధారాలు చూపించాలంటూ ఆయన డిమాండ్ చేశారు. దీనిపై ఢిల్లీ మంత్రి మజీంద్‌ సింగ్‌ సిర్సా తీవ్రంగా స్పందించారు. "మన వైమానిక దళం, సైన్యం కెపాసిటీని కాంగ్రెస్ నాయకులు తక్కువగా అంచనా వేస్తున్నారు. ఆ పార్టీ నాయకులు, గాంధీ కుటుంబం ఆలోచనా విధానం ఏమిటో అర్థమవుతోంది. సర్జికల్ స్ట్రైక్స్‌పై ఆధారాలు కావాలంటే వారంతా పాకిస్తాన్‌కు వెళ్లి స్వయంగా పరిశీలించుకోవచ్చు" అని ఆయన ఘాటుగా బదులు ఇచ్చారు. బీజేపీ నుంచి విమర్శలు రావడంతో చరణ్‌జీత్‌ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారు. తాను ఆధారాలు అడగలేదని వివరణ ఇచ్చారు.

జమ్మూ కాశ్మీర్‌లోని ఉరి సెక్టార్‌లో ఆర్మీ బ్రిగేడ్ హెడ్‌క్వార్టర్స్‌పై 2016 సెప్టెంబరులో ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ ఘటనలో 19 మంది మన జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ప్రతీకారంగా అదే నెలలో భారత సైన్యం లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి పీఓకేలోని టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లపై సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. ఉగ్రవాదులు భారత్‌పై దాడి చేసేందుకు కుట్ర చేస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో ఈ ఆపరేషన్ చేపట్టినట్లు అప్పట్లో ఆర్మీ ప్రకటించింది.

Tags:    

Similar News