చరణ్, తారక్, ప్రభాస్ లా మహేష్ శ్రమించలేదా?
మరి మహేష్ అలా రెడీ అయ్యాడా? మిల్క్ బోయ్ ని జక్కన్న అంతగా కష్టపెట్టాడా? అంటే అదెక్కడా కనిపించడం లేదు.;
`బాహుబలి` సమయంలో ప్రభాస్, రానాలు సినిమా ప్రారంభానికి ముందు ఎలా సన్నధం అయ్యారో తెలిసిందే. ప్రభాస్ డ్యూయెల్ రోల్స్ పోషించాల్సి రావడంతో ఒక పాత్రకు బరువు పెరగడం..మరో పాత్రకు బరువు తగ్గడం జరిగింది. ప్రభాస్ బాడీలో ఈ మార్పు స్పష్టంగా కనిపించింది. అమరేంద్ర బాహుబలిలో కనిపిచండం కోసం భారీ దేహం... మహేంద్ర బాహుబలిలో కనిపించడం కోసం మరోలా శరీరంలో మార్పులు తీసుకురావాల్సి వచ్చింది. అందుకోసం ప్రభాస్ ఎంతో కష్టపడ్డాడు.
ఒకకొన దశలో అనారోగ్యానికి గురయ్యాడు. భల్లాల దేవ పాత్ర కోసం రానా కూడా అంతే శ్రమించాల్సి వచ్చింది. భారీ దేహంతో కూడిన శరీరం కోసం తీసుకునే ఆహారంలో మార్పులు, కసరత్తులు చేసే సమయంలో మార్పులు ఇలా ఎన్నో చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత `ఆర్ ఆర్ ఆర్` సినిమా కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్ కూడా అంతే శ్రమిం చారు. బ్రిటీష్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చరణ్ భారీ దేహం...సిక్స్ ప్యాక్ లుక్ ఆ ట్రాన్స పర్మేషన్ చూసే స్టన్ అయ్యారంతా.
ప్రభాస్ కష్టమంతా అందులో కనిపించింది. అలాగే ఎన్టీఆర్ కొమారం భీమ్ రోల్ కోసం అంతకు మించి శ్రమించాడు. బరువు మరింతగా తగ్గి సిక్స్ ప్యాక్ లంగోటా లుక్ చూడొచ్చు. అడవి బిడ్డగా తారక్ ఎంతో శ్రమించాడు. రాజమౌళితో సినిమా అంటే హీరో ఇలా తయారవ్వాల్సి ఉంటుంది. మహేష్ రాజమౌళి సినిమా విషయం బయటకు వచ్చినప్పుడు ఎన్టీఆర్ చేస్తున్నావ్ గా? జక్కన్న తో! సినిమా అంటే ఎలా ఉంటుందోనని ఓ షోలో ఆటపట్టించాడు.
మరి మహేష్ అలా రెడీ అయ్యాడా? మిల్క్ బోయ్ ని జక్కన్న అంతగా కష్టపెట్టాడా? అంటే అదెక్కడా కనిపించడం లేదు. లుక్ పరంగా మహేష్ బాడీలో ఎలాంటి కొత్త మార్పులు రాలేదు. `గుంటూరు కారం` టైమ్ లో ఉన్న వెయిట్ లోనే కొనసాగుతున్నారు. వచ్చిన మార్పు ఏదైనా ఉంది? అంటే అది కేవలం ఒక్క హెయిర్ స్టైల్లో మాత్రమే. అంతకు మించి ఒక్క ఛేంజ్ కూడా మహేష్ లో రాలేదు.
విదేశాల్లో...ఆప్రికన్ అడవుల్లో ట్రైనింగ్ తీసుకున్నాడని ప్రచారం జరిగింది. కానీ అలా ట్రైనింగ్ తీసు కుంటే శరీరంలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. స్కిన్ టోన్ మారుతుంది. ముఖంలో మార్పులొస్తాయి. కానీ అవెక్కడా మహేష్ లో కనిపించలేదు. దీంతో రాజమౌళి మహేష్‌ని పెద్దగా కష్టపెట్టినట్లు ఎక్కడా కనిపిం చడం లేదనే టాపిక్ మొదలైంది. మేకోవర్ టార్గెట్ లేకుండానే మహేష్ బరిలోకి దిగడంటున్నారు.