• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కాంతార చాప్టర్ 1: కనకవతి...

కాంతార చాప్టర్ 1: కనకవతి వచ్చేసింది!

| ఇప్పటికే షూటింగ్ సమయంలో ఎదురైన అనేక ఇబ్బందులను అధిగమించి, ఇప్పుడు ప్రమోషన్లలో జోరు పెంచింది చిత్రయూనిట్.

By - M Prashanth
Update: 2025-08-08 05:22 GMT

కేజీఎఫ్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో సంచలనం సృష్టించిన కన్నడ సినిమా కాంతార. కన్నడ సినీ పరిశ్రమను ఓ రేంజ్‌లో తీసుకెళ్లిన ఈ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న కాంతార: చాప్టర్ 1 పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం మరోసారి భక్తి, గ్రామీణ నేపథ్యంలో ప్రేక్షకులను కొత్త లోకాల్లోకి తీసుకెళ్లబోతోందన్న మాట ఫ్యాన్స్ లో ఆసక్తిని రేపుతోంది.


ఇప్పటికే షూటింగ్ సమయంలో ఎదురైన అనేక ఇబ్బందులను అధిగమించి, ఇప్పుడు ప్రమోషన్లలో జోరు పెంచింది చిత్రయూనిట్. ఇప్పటికే చిత్రానికి సంబంధించి పోస్టర్లు, గ్లింప్స్, బిట్స్ విడుదల చేసినప్పటికీ తాజా అప్డేట్ సినిమాపై హైప్ ను మరింత పెంచింది. తాజాగా, సినిమాలో కీలక పాత్ర అయిన కనకవతి లుక్‌ను విడుదల చేశారు.

ఈ పాత్రలో రుక్మిణి వసంత్ కనిపించనుండగా, కనకవతి పాత్రను పరిచయం చేస్తూ విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ట్రేడిషనల్ లో ఘనంగా ఉన్న రుక్మిణి వసంత్ లుక్ సినిమా మూడ్‌ను తెలియజేస్తోంది. ప్రత్యేకంగా తీసిన ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను మరో మెట్టు పైకి తీసుకెళ్లింది. ఇదే సందర్భంలో, కాంతార చాప్టర్ 1 సినిమా ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 2న గ్రాండ్‌గా విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు.

ఇందులో రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించడమే కాదు, దర్శకత్వ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. విజయ్ కిరగందూర్ హోంబాలే ఫిలింస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. కన్నడతో పాటు తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రం, గతంలో అందుకున్న ఘనవిజయాన్ని మరింతగా నిలబెట్టుకుంటుందనే నమ్మకం యూనిట్ లో కనిపిస్తోంది.

కాంతార మొదటి భాగంలో చూపించిన కథ కంటే మరిన్ని రహస్యాలు, భక్తి విలువలు ఇవన్నీ రెండో భాగంలో మళ్ళీ చూపించబోతున్నట్టు టీమ్ హింట్ ఇచ్చింది. గతంలో జరిగిన కథను ఈ ప్రీక్వెల్ లో చూపించబోతున్నారు. రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్ లతో పాటు మరికొందరు ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ట్రైలర్ మరియు మిగతా పాటలకు సంబంధించి త్వరలోనే మరిన్ని అప్డేట్స్ రానున్నాయంటూ సమాచారం.

Tags:    
  • KantaraChapter1 
  • RishabShetty 
  • Kanakavathi 
  • RukminiVasanth 
  • PanIndiaFilm 
  • HombaleFilms 
  • KannadaCinema 
  • IndianCinema 
  • Kantara Chapter 1 
  • Rishab Shetty Kantara 
  • కాంతార చాప్టర్ 1 
  • రిషబ్ శెట్టి 
  • కనకవతి 
  • రుక్మిణి వసంత్ 

Similar News

ర్యాపిడ్ ఫైర్ లో చైతూను ఇరికించేసిన సుమా.. ఏం క్లారిటీ గురూ!

2026-11-09 04:25 GMT

హీరోయిన్ అవ్వాలంటే.. అందమే ముఖ్యమా.. జాన్వీ..?

2026-11-09 04:25 GMT

వ‌రుస‌గా క్రేజీ సినిమాల‌తో రేసులో అగ్ర నిర్మాణ సంస్థ

2026-11-09 04:24 GMT

ప్రభాస్ ఈ సినిమాలకు సీక్వెల్స్ చేస్తే బాగుంటుందా?

2026-11-09 04:16 GMT

ఎడిట‌ర్ ఆవేద‌న‌: ఫంక్ష‌న్ల‌కు వెళ్లినా ప‌ట్టించుకోని శాఖ ఇది!

2026-11-09 03:40 GMT

మాఫియా బెదిరింపులు.. ప‌రిశ్ర‌మ‌ కుట్ర‌లు.. అన్నిటినీ ఎదురొడ్డి నిలిచిన హీరో!

2026-11-08 14:30 GMT

'ఇడుపు కాయితం' నుంచి బరాత్ బీట్.. నాగదుర్గ డ్యాన్స్ అదిరిందిగా!

2026-11-08 13:36 GMT

క్లాస్ + మాస్ క‌లిపి కొడ‌తాడు బాస్!

2026-11-08 12:30 GMT

రజనీ కొత్త పోస్టర్.. ఈసారి గన్ కూడా అవసరం పడలేదే!

2026-11-08 11:14 GMT

సౌత్ సినిమాలపై ఇంత ప్రేమ ఎందుకు జాన్వీ పాప..!

2026-11-08 11:13 GMT

'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' ఎంద‌రికి పెద్ద ఛాన్సులిస్తుంది?

2026-11-08 11:12 GMT

తెలిసిన క‌థ‌తో ఇదే స‌మ‌స్యా?

2026-11-08 11:11 GMT

Copyright @2026

Powered by Blink CMS