కల్కి సీక్వెల్ ఎంతవరకు వచ్చింది?
ఇప్పుడు ఆ షెడ్యూల్ లో ప్రభాస్ కూడా జాయిన్ కానున్నారని టాక్ వినిపిస్తోంది. మొదటి భాగంలో ప్రభాస్ రెండు వేరియేషన్స్ లో కనిపించారు.;
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఆ మూవీ.. ఇండియన్ సినిమాను కొత్త స్థాయికి తీసుకెళ్లింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ ఎలా ముందుకు సాగుతోంది? ప్రభాస్ నుంచి ఎలాంటి సర్ప్రైజ్ లు ఉండబోతున్నాయి? అన్న ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది.
టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఆ సీక్వెల్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే కొంత భాగం పూర్తవ్వగా, తాజాగా మరో కీలక షెడ్యూల్ ప్రారంభమైనట్లు సమాచారం. ముఖ్యంగా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ పై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. మొదటి భాగంతో పోలిస్తే వీరి పాత్రలకు ఈసారి మరింత స్పేస్ ఉండబోతుందని తెలుస్తోంది. ముఖ్యంగా వీరిద్దరూ ప్రభాస్ తో కలిసి వచ్చే సీన్స్ సినిమాకు హైలైట్ గా నిలిచే అవకాశముంది.
ఇప్పుడు ఆ షెడ్యూల్ లో ప్రభాస్ కూడా జాయిన్ కానున్నారని టాక్ వినిపిస్తోంది. మొదటి భాగంలో ప్రభాస్ రెండు వేరియేషన్స్ లో కనిపించారు. భైరవగా ప్రధాన కథను నడిపించిన ఆయన, కర్ణుడిగా కేవలం కొన్ని నిమిషాలే కనిపించినా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. అయితే సీక్వెల్ లో కర్ణుడి పాత్రకు ఎక్కువ ప్రాధాన్యం ఉండబోతుందని సమాచారం. దాదాపు అరగంట పాటు ఆ పాత్రను చూపించేలా ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ప్రభాస్ నుంచి మరో కొత్త లుక్ కూడా ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది.
అదే సినిమాకు బిగ్ సర్ప్రైజ్ ఎలిమెంట్ గా మారుతుందని ప్రచారం జరుగుతోంది. కొన్నిరోజులుగా హైదరాబాద్ లోని భారీ సెట్లలో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ నెలలోనే ప్రభాస్ పై కీలక యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ప్రభాస్ మరోవైపు స్పిరిట్, ఫౌజీ వంటి ప్రాజెక్టులతో కూడా బిజీగా ఉన్నారు. అయినప్పటికీ కల్కి సీక్వెల్‌ను వేగంగా పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
వైజయంతీ మూవీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఆ చిత్రానికి సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నారు. హాలీవుడ్ రేంజ్ విజువల్స్, అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్ తో రూపొందుతున్న ఆ సీక్వెల్ పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. అదే సమయంలో సీక్వెల్ కు సంబంధించి టైటిల్ విషయంలో ఆసక్తికరమైన ప్రచారం సాగుతోంది. కర్ణ 3102 బీసీ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
కథ మహాభారతంలోని కర్ణుడి పాత్ర చుట్టూ తిరిగే అవకాశం ఉండటంతో టైటిల్ కు ప్రాధాన్యం ఇస్తున్నారనే చర్చ జరుగుతోంది. అయితే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది. ఏదేమైనా కల్కి సీక్వెల్ కేవలం కథ పరంగా మాత్రమే కాకుండా, విజువల్స్ పరంగా కూడా మరింత గ్రాండ్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రభాస్ నుంచి వచ్చే సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఆ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లే అవకాశముంది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.