అగ్రహీరో మేనల్లుడి ముందు పెనుసవాల్
మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ రొమాంటిక్ కామెడీలతో యువతరం హృదయాలలో నిలిచాడు.;
మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్ రొమాంటిక్ కామెడీలతో యువతరం హృదయాలలో నిలిచాడు. అతడు నటించిన ప్రారంభ చిత్రాలు కల్ట్ క్లాసిక్ జానర్ లో చక్కని విజయాలు సాధించాయి. చూడటానికి పక్కింటబ్బాయిలా సింపుల్ గా కనిపించే ఇమ్రాన్.. తన శరీర భాషకు తగ్గ ఎమోషనల్ లవ్ స్టోరీలు రొమాంటిక్ కామెడీలను ఎంపిక చేసుకుని చాలా మ్యాజిక్ చేసాడు. జానే తు యా జానే నా, ఐ హేట్ లవ్ స్టోరీస్, మేరే బ్రదర్ కి దుల్హాన్ లాంటి క్లాసిక్స్ ని అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు.
అయితే కొన్ని వరుస పరాజయాలు అతడిని బ్యాక్ బెంచీకి పరిమితం చేసాయి. దీనికి తోడు భార్య అవంతికతో తలెత్తిన విభేధాలు, ఫ్యామిలీ సమస్యలు అతడిని తీవ్ర ఒత్తిడిలోకి దించేసాయి. ఈ పరిస్థితుల నుంచి కోలుకోవడానికి అతడికి ఏకంగా దశాబ్ధం పట్టింది. ఇంతకాలానికి అతడు తిరిగి నటనలోకి రీఎంట్రీ ఇస్తున్నాడు.`బ్రేక్ కే బాద్` ఫేం డానిష్ అస్లామ్ రూపొందించనున్న ఓ రొమాంటిక్ డ్రామాలో నటించడానికి సంతకం చేసాడు. ప్రస్తుతం ఇమ్రాన్ తన లుక్ ని రీషేప్ చేస్తూ దానికోసం గంటల తరబడి జిమ్ లో గడుపుతున్నాడు. అతడు ఇప్పుడు మారిన రూపాన్ని ప్రదర్శిస్తూ ఇంతకుముందు ఓ లీక్ కూడా ఇచ్చాడు. అతడు ఇప్పుడు పర్ఫెక్ట్ ఫిట్ లుక్ తో ఆశ్చర్యపరుస్తున్నాడు.
ఇమ్రాన్ తన శరీర భాషకు తగ్గట్టు మరో రొమాంటిక్ కామెడీతో తిరిగి వస్తున్నాడని అంతా భావిస్తున్నారు. మంచి కథ, అందులో లవ్, కామెడీ, ఎమోషన్, మంచి మ్యూజిక్ వర్కవుటైతే, ఇమ్రాన్ తిరిగి హిట్టు కొట్టే ఛాన్సుంది. అయితే ఇన్నేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న ఈ హీరోని జనం తిరిగి మునుపటిలాగా ప్రేమతో ఆదరిస్తారా? అప్పటి క్రేజ్ ఇప్పుడు ఉంటుందా? అన్నది వేచి చూడాలి. మొదటి సినిమా ఫలితం కొన్నిటికి సమాధానాలు ఇవ్వగలదు.