నటవారసులు ఈసారైనా గట్టెక్కుతారా?
స్టార్ కిడ్స్ ఇప్పుడు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. సినీపరిశ్రమల్లో మారిన పరిస్థితులు వారసులకు అనుకూలంగా లేవు.;
స్టార్ కిడ్స్ ఇప్పుడు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. సినీపరిశ్రమల్లో మారిన పరిస్థితులు వారసులకు అనుకూలంగా లేవు. కేవలం స్టార్ల పిల్లలను మాత్రమే ఆదరించే పరిస్థితులు లేనే లేవు. ప్రతిభ ఉంటే ఇన్ సైడర్ ఔట్ సైడర్ అనే తేడా ఏం లేదు. ఫుల్ మీల్స్ పక్కాగా అందించే ఏ ఆర్టిస్టుకైనా ఇప్పుడు పెద్ద తెర- చిన్న తెర అవకాశాలకు కొదవేమీ లేదు. చాలామంది ఔట్ సైడర్స్ ఇప్పుడు ఇండస్ట్రీని ఏల్తున్నారు.
అయినా నటవారసులు వస్తున్నారు! అంటే అంతో ఇంతో క్రేజ్ ఉంటుంది. కానీ ఇటీవల నటవారసులు ఎవరూ ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేక చతికిలబడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇంతకుముందు నాదనియాన్ చిత్రంతో బాలీవుడ్ కి పరిచయం అయిన బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటవారసుడు ఇబ్రహీం అలీఖాన్ తన తొలి చిత్రంతో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. అతడి లుక్స్ బావున్నా నటన, అభినయం, డైలాగ్ డెలివరీపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. అతడు కనీస మాత్రంగా కూడా నటించలేకపోయాడని, తండ్రితో పోలిస్తే పూర్ క్వాలిటీస్ తో నిరాశపరిచాడని విమర్శించారు.
అయినా ఇబ్రహీంకి అవకాశాల పరంగా కొదవేమీ లేదు. మొదటి ప్రయత్నం ఫ్లాపైనా వరుసగా రెండు మూడు చిత్రాల్లో నటించేస్తున్నాడు. ఇప్పుడు అతడు మేటి కథానాయిక రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీతో కలిసి ఓ రొమాంటిక్ చిత్రంలో నటించనున్నాడు. రాషా ఇప్పటికే అజయ్ దేవగన్ మేనల్లుడు అమన్ దేవగన్ డెబ్యూ ఇచ్చిన ఆజాద్ చిత్రంలో కథానాయికగా నటించింది. యంగ్ బ్యూటీ నటన, డ్యాన్సులకు యూత్ ఫిదా అయిపోయారు. రాషా అందచందాలు ఇండస్ట్రీలో షివరింగ్ పుట్టిస్తున్నాయి. ఆజాద్ ఫ్లాపైనా రాషాకు మాత్రం గుర్తింపు దక్కింది. ఇక అజయ్ దేవగన్ మేనల్లుడికి కూడా అంతగా గుర్తింపు దక్కలేదు. అందుకే ఇప్పుడు ఫ్లాప్ స్టార్ కిడ్ ఇబ్రహీం సరసన రాషా తడాని నటిస్తోంది అనగానే సర్వత్రా వ్యతిరేకత నెలకొంది. అయితే రాషా కారణంగా ఇబ్రహీంకి హిట్టొస్తుందని కొందరు జోశ్యం చెబుతున్నారు. సాధ్యమైనంత తొందర్లోనే రాషా తడానీ టాలీవుడ్ లో కూడా అడుగుపెడుతుందని అంతా భావిస్తున్నారు.
రొమాంటిక్ కామెడీతో తెరకు పరిచయమైన ఇబ్రహీం సర్జమీన్, డిలర్ లాంటి చిత్రాలలో సీరియస్ పాత్రలలో కనిపిస్తాడు. తదుపరి రాషా తడానీతో కలిసి పూర్తి రొమాంటిక్ డ్రామాలో కనిపిస్తాడని సమాచారం. ప్రస్తుతం ఇబ్రహీం- రాషా తడానీ తమ చిత్రం కోసం వర్క్‌షాప్‌లకు అటెండవుతున్నారు. నటవారసులు ఈసారైనా గట్టెక్కుతారా లేదా? అన్నది వేచి చూడాలి.