నార్త్ ఇండియాపై వీరమల్లు ఫోకస్.. ప్లాన్స్ ఎలా ఉన్నాయంటే?

ఈ పాటతో పాటు మరో రెండు సాంగ్స్ కూడా త్వరలో రిలీజ్ చేసి, సినిమా క్రేజ్‌ను మరింత పెంచేందుకు టీమ్ సన్నాహాలు చేస్తోంది.;

Update: 2025-05-25 05:41 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతూ సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పీరియడ్ యాక్షన్ డ్రామా షూటింగ్ సమయంలో హైప్‌ను కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, ఇప్పుడు ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. క్రిష్ జాగర్లమూడి నుంచి దర్శకత్వ బాధ్యతలు తీసుకున్న జ్యోతి కృష్ణ ప్రమోషన్స్‌ను ముందుండి నడిపిస్తున్నారు.

ఇటీవల ఎక్స్‌లో జరిగిన స్పేస్ సెషన్‌లో ఆయన ప్రమోషన్ ప్లాన్స్ గురించి ఆసక్తికర వివరాలు వెల్లడించారు. జ్యోతి కృష్ణ వెల్లడించిన విషయం ప్రకారం, ‘హరిహర వీరమల్లు’ ట్రైలర్‌ను నార్త్ ఇండియాలో గ్రాండ్‌గా లాంచ్ చేయాలని టీమ్ నిర్ణయించింది. అయితే, ఖచ్చితమైన వేదికను ఇంకా ఎంపిక చేయలేదు. ఇటీవల కాలంలో టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలు ఇతర రాష్ట్రాల్లో ఈవెంట్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

‘పుష్ప 2’ టీమ్ బీహార్‌లో, ‘గేమ్‌చేంజర్’ టీమ్ లక్నోలో భారీ ఈవెంట్స్ నిర్వహించి మంచి క్రేజ్ అందుకున్నాయి. ఈ నేపథ్యంలో ‘హరిహర వీరమల్లు’ టీమ్ ఏ ప్రాంతాన్ని ఎంచుకుంటుందో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా నాలుగో సింగిల్ మే 28న విడుదల కానుందని జ్యోతి కృష్ణ తెలిపారు. ఈ ఐటెం సాంగ్‌లోని కొన్ని లిరిక్స్ అభ్యంతరకరంగా ఉన్నాయని భావించిన పవన్ కళ్యాణ్, వాటిని మార్చాలని టీమ్‌ను కోరిన సంగతి తెలిసిందే.

ఈ పాటతో పాటు మరో రెండు సాంగ్స్ కూడా త్వరలో రిలీజ్ చేసి, సినిమా క్రేజ్‌ను మరింత పెంచేందుకు టీమ్ సన్నాహాలు చేస్తోంది. పవన్ కళ్యాణ్, హీరోయిన్ నిధి అగర్వాల్‌తో ఇంటర్వ్యూలు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ ఇంటర్వ్యూలు సినిమా రిలీజ్‌కు ముందు ఆడియన్స్‌లో హైప్‌ను పెంచేలా ఉంటాయని టీమ్ భావిస్తోంది.

ఇప్పటికే సినిమా ఆడియో ఆల్బమ్‌కు మంచి ఆదరణ లభిస్తోంది, మిగిలిన సాంగ్స్‌తో క్రేజ్ మరింత పెరుగుతుందని అంటున్నారు. ఎఎమ్ రత్నం నిర్మిస్తున్న ఈ సినిమా జూన్ 12న ఐదు భాషల్లో విడుదల కానుంది. బాబీ డియోల్, కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం పవన్ కళ్యాణ్ అభిమానులకు విజువల్ ట్రీట్‌గా నిలవనుంది. ఇక పాన్ ఇండియా మార్కెట్ లో సినిమా ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Tags:    

Similar News