ఫేమ‌స్ సింగ‌ర్ ఇంట శుభ‌వార్త ఏంటో తెలుసా?

బుల్లి బేబి వాళ్లిద్ద‌రి జీవితాల్లోకి రాబోతుందంటూ అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు.

Update: 2024-05-10 10:40 GMT

ఫేమ‌స్ కెన‌డా సింగ‌ర్ జ‌స్టిన్ బీబ‌ర్ తండ్రి కాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. భార్య హేలి గ‌ర్బం దాల్చిన విష‌యాన్ని బీబ‌ర్ స్వ‌యంగా తెలిపాడు. భార్య బేబీ బంప్ తో ఉన్న కొన్ని ఫోటోలు షేర్ చేసాడు. దీంతో బీబ‌ర్ అభిమానులు ఇద్ద‌రికి విషెస్ తెలియ‌జేస్తున్నారు. బుల్లి బేబి వాళ్లిద్ద‌రి జీవితాల్లోకి రాబోతుందంటూ అభిమానులు సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. బీబర్- హేలీ 2018లో వివాహం చేసుకున్నారు.

'బేబి'..'లెట్ మీ ల‌వ్ యూ'..'మై వ‌ర‌ల్డ్ 2.0' లాంటి పాట‌లు జ‌స్టిన్ బీబ‌ర్ కి ప్ర‌పంచ వ్యాప్తంగా మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ఇత‌డు గాయ‌కుడే కాదు . మంచి పాటల రచయిత కూడా. 15 సంవత్సరాల వయస్సులోనే మొదటి ఆల్బమ్‌ను విడుదల చేసాడు. అది మంచి విజ‌యం సాధించింది. ఆ త‌ర్వాత `బేబీ' హిట్ సింగిల్స్‌తో మ‌రింత ఫేమ‌య‌స్ అయ్యాడు. బీబర్ కూడా యూ ట్యూబ్ ద్వారా వెలుగులో కి వ‌చ్చిన గాయ‌కుడే. అందుకోసం చాలా శ్ర‌మించాడు. త‌న ట్యాలెంట్ ని గుర్తించిన మ‌రో క‌ళ‌కారుడు అవ‌కాశం ఇవ్వ‌డంతోనే ఆస్థాయికి చేరుకున్నాడు.

అయితే బీబ‌ర్ చిన్న వ‌య‌సులోనే ముఖ పక్షవాతానికి కూడా గుర‌య్యాడు. రామ్ సే హంట్ సిండ్రోమ్ (వ్యాధి)తో బాధపడుతున్నట్టు గ‌తంలో తెలిపాడు. ఈ వ్యాధిలో భాగమే ముఖానికి పక్షవాతమని.. కన్ను కూడా ఆర్పలేనని వివరించాడు. ముఖంలో నాడీ వ్యవస్థ దెబ్బతిన్నట్టు ప్రకటించాడు. ఈ వ్యాధి కారణంగా జస్టిన్ బీబర్ రెండ‌ళ్ల క్రితం టొరంటో, వాషింగ్టన్ డీసీ ఈవెంట్లు ర‌ద్దు చేసుకున్నాడు.

ఆ కార‌ణంగా కోట్ల రూపాయ‌లు న‌ష్ట‌పోయాడు. పూర్తిగా కోలుకునే వరకు ఎటువంటి సంగీత ప్రదర్శనలు ఉండవని ప్రకటించాడు. ప్ర‌స్తుతం బీబ‌ర్ కోలుకుని ఆరోగ్యంగా ఉన్నాడు. ప‌రిస్థితుల‌న్నీ చ‌క్క‌బ‌టంతో మ‌ళ్లీ గాయ‌కుడిగా బిజీ అవుతున్నాడు. ఇంత‌లోనే భార్య గ‌ర్బం దాల్చ‌డంతో బీబీర్ ఆనందానికి అవ‌దుల్లేవ్.

Read more!
Tags:    

Similar News