లియోలో చరణ్‌.. ఫ్రీ పబ్లిసిటీ వాడేసుకుంటున్నారు

కానీ అసలు విషయం ఏంటి అంటే లియో కి చరణ్ కి అసలు సంబంధం లేదు.. కనీసం చరణ్ పేరు కూడా లియో లో వినిపించదు.

Update: 2023-10-14 11:30 GMT

తమిళ్ సూపర్ స్టార్‌ విజయ్ హీరో గా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన లియో సినిమా ఈ దసరాకి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో చరణ్‌ ఉన్నాడు అంటూ ఎలా ప్రచారం మొదలైందో కానీ సినిమాకు భలే కలిసి వస్తుందని సినీ విశ్లేషకులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

లియో సినిమా లో చరణ్ ఉన్నాడు.. విక్రమ్‌ లో సూర్య ఎలా అయితే రోలెక్స్ పాత్ర లో కనిపిస్తాడో అలాగే చిన్న పాత్రను చరణ్ తో లోకేష్ చేయించాడు అంటూ వార్తలు గుప్పుమన్నాయి. మెగా ఫ్యాన్స్ తో పాటు అంతా కూడా నిజంగానే లియో లో చరణ్ ఉన్నాడేమో అనుకుంటున్నారు. కానీ అసలు విషయం ఏంటి అంటే లియో కి చరణ్ కి అసలు సంబంధం లేదు.. కనీసం చరణ్ పేరు కూడా లియో లో వినిపించదు.

అయినా కూడా లియో చరణ్‌ ఉన్నాడు అనే ప్రచారంను కొందరు కావాలని చేస్తున్నారు. ఇప్పటికే మెగా కాంపౌండ్‌ నుంచి లియో లో చరణ్‌ లేడు అంటూ క్లారిటీ వచ్చింది. కానీ లియో మేకర్స్ మాత్రం చరణ్‌ ఉన్నాడు.. లేదు అనే విషయమై స్పందించడం లేదు. చరణ్‌ గురించిన వార్తలతో లియో కి మంచి బజ్ క్రియేట్‌ అవుతుందని వారు సంతోషం గా ఉన్నట్లున్నారు.

లియో లో చరణ్‌ ఉన్నాడు అంటూ వస్తున్న పబ్లిసిటీ కారణంగా సినిమాకు ఫ్రీ గా బజ్ పెరుగుతుందని.. కనుక దాన్ని తాము ఎందుకు వదులుకోవాలి అన్నట్లుగా లియో మేకర్స్ ఉన్నట్లున్నారు.. అందుకే సినిమా విడుదల అయ్యే వరకు కూడా లియో లో చరణ్ లేడు అనే విషయాన్ని క్లారిటీ ఇచ్చే అవకాశం లేదు అంటున్నారు.

Tags:    

Similar News