హరి హర ఇంకెన్నాళ్లు దొర..?

సినిమాను పూర్తి చేయాలనే తొందర దర్శక నిర్మాతలకు ఉన్నా పవన్ కళ్యాణ్ డేట్స్ మాత్రం కుదరట్లేదట. అందుకే ఆయన ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు పూర్తి చేద్దామని అనుకుంటున్నారట.

Update: 2024-01-30 12:18 GMT

పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ లో హరి హర వీరమల్లు సినిమా వస్తుంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఫస్ట్ టైం ఒక పీరియాడికల్ అటెంప్ట్ గా ఈ సినిమా మొదలు పెట్టారు. సినిమాను మొదలు పెట్టి నాలుగేళ్లు అవుతున్నా ఇప్పటివరకు సినిమా పూర్తి కాలేదు సరికదా ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. క్రిష్ పవన్ ఈ క్రేజీ కాంబోలో హరి హర వీరమల్లు అని అనౌన్స్ మెంట్ రాగానే పవర్ స్టార్ ఫ్యాన్స్ లో అంచనాలు భారీగా ఏర్పడ్డాయి.

అయితే షూటింగ్ మధ్య గ్యాప్ రావడం, కోవిడ్ టైం లో షూటింగ్ ఆగిపోవడం ఇలా జరుగుతూ చూస్తుండగానే సినిమా మొదలు పెట్టి నాలుగేళ్లు గడిచిపోయింది. ఇప్పటికీ సినిమా ఇంకా చేయాల్సిన పార్ట్ బాగానే ఉందని టాక్. పవన్ డేట్స్ కోసం ఎదురుచూసి విసిగిపోయిన క్రిష్ త్వరలో మరో కొత్త ప్రాజెక్ట్ మొదలు పెట్టాలని ఫిక్స్ అయ్యాడట. నిర్మాత ఎస్.జే సూర్య మాత్రం సినిమా మళ్లీ త్వరలోనే సెట్స్ మీదకు వెళ్తుంది ఈ ఇయర్ రిలీజ్ ఉంటుంది అన్నట్టుగా చెబుతున్నారు.

Read more!

పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా సినిమాపై ఆశలు వదులుకున్నారు. అప్పుడెప్పుడో సినిమా స్టార్ట్ అయిన కొత్తలో పవన్ బర్త్ డే సందర్భంగా ఒక టీజర్ వదిలారు కానీ తర్వాత సినిమా గురించి ఫ్యాన్స్ పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ సినిమాకు మామూలుగానే బజ్ విపరీతంగా ఉంటుంది. కానీ హరి హర వీరమల్లు విషయంలో ఆ బజ్ ఏమాత్రం లేదు.

సినిమాను పూర్తి చేయాలనే తొందర దర్శక నిర్మాతలకు ఉన్నా పవన్ కళ్యాణ్ డేట్స్ మాత్రం కుదరట్లేదట. అందుకే ఆయన ఎప్పుడు డేట్స్ ఇస్తే అప్పుడు పూర్తి చేద్దామని అనుకుంటున్నారట. ఈలోగా పవన్ వచ్చే దాకా మరో సినిమా చేసేందుకు చూస్తున్నాడు. పవన్ క్రిష్ కాంబోలో వస్తున్న హరి హర వీరమల్లు సినిమా నాలుగేళ్లుగా సెట్స్ మీద ఉండటం చూసిన ఫ్యాన్స్ హరి హర ఇంకెన్నాళ్లు తీస్తారు దొరా అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ ఎలక్షన్స్ బిజీలో ఉన్నాడు. ఈ రెండు మూడు నెలలు సినిమాల గురించి ఆలోచించడం కష్టం.

ఆఫ్టర్ ఎలక్షన్స్ ముందు సుజిత్ ఓజీకి డేట్స్ ఇస్తాడని టాక్. ఆ సినిమాను సెప్టెంబర్ లో రిలీజ్ కూడా అనౌన్స్ చేశారు. సో ఆ సినిమా తర్వాత హరి హర వీరమల్లుకి డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాతో పాటుగా హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ కూడా కొంత పార్ట్ షూటింగ్ చేసి అలా పక్కన పెట్టారు. పవన్ వస్తే ఈ మూడు సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేయాలని చూస్తున్నారు.


Tags:    

Similar News