చ‌దువు లేకుండానే దునియాని దున్నేస్తోన్న బ్యూటీ!

కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న సవాళ్లు, ఆ తర్వాత సాధించిన ప్రస్థానం ఆసక్తికరంగా ఉంటుంది.

Update: 2026-07-11 11:30 GMT

సమాజంలో ఉన్నత చదువులు ఉంటేనే ? విజయం వరిస్తుందనే సాధారణ అభిప్రాయం బలంగా పాతుకు పోయింది. అయితే? ఎందరో ప్రముఖులు జీవిత ప్రయాణంలో డిగ్రీలు, పట్టాలు లేకపోయినా? అపారమైన ప్రతిభతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు. ఈ కోవకే చెందుతారు ఓ ప్ర‌ముఖ బుల్లితెర ఫేమ‌స్ యాంక‌ర్. గ్లామర్, యాంకరింగ్, నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న బ్యూటీ విద్యాభ్యాసం గురించి బహిరంగంగా పంచుకున్న విషయాలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న సవాళ్లు, ఆ తర్వాత సాధించిన ప్రస్థానం ఆసక్తికరంగా ఉంటుంది.

తాను అత్యున్నత విద్యను అభ్యసించలేదని.. వైజాగ్ లో దూరవిద్య ద్వారా చదువును కొనసాగించే ప్రయత్నం చేసినా? కొన్ని కారణాల వల్ల ఆ చ‌దువు మధ్యలోనే వదిలేయాల్సి వచ్చిందని వెల్లడించారు. ఉన్నత చదువులు లేకపోవడం ఒక లోటుగా కాకుండా? దానికి బదులుగా జీవితం నేర్పిన పాఠాలనే తన విజయానికి సోపానాలుగా మార్చుకున్నాన‌న్నారు. బుల్లితెరపై యాంకర్‌గా రాణించడం అంటే అందం ఉంటే సరిపోదు. చురుకైన మాటతీరు, సందర్భోచితమైన హాస్యం, అతిథులను హ్యాండిల్ చేసే సమయస్ఫూర్తి చాలా అవసరం.

ఆ బ్యూటీ తన ప్రయాణంలో ఈ లక్షణాలను సొంతంగానే అలవర్చుకున్నారు. పాఠశాల గదుల్లో నేర్చుకునే విద్యాభ్యాసం కంటే కెమెరా ముందు రోజువారీ చేసే పని ద్వారా ఆమె పొందిన అనుభవమే పరిణతి చెందిన ప్రెజెంటర్‌గా తీర్చిదిద్దింది. కెరీర్ ప్రారంభంలో అనేక విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. కొంత మంది తన చదువు గురించి నేపథ్యం గురించి ఎన్నో రకాలుగా విమర్శించినా? వాటిని పట్టించుకోకుండా పనిపైనే దృష్టి పెట్టారు. అయితే ఆ యాంక‌ర్ సాధించిన విజయానికి అదృష్టం మాత్రమే కారణం కాదు. ఆమెలో పట్టుదల, కష్టపడే తత్వం ,కొత్త విషయాలను నేర్చుకోవాలనే తపన కారణమని దగ్గరగా గమనించిన వారు చెబుతుంటారు.

చ‌దువు లేని యువతకు ఆమె ప్రయాణం స్పూర్తిగా చెప్పొచ్చు. చదువు అనేది ఆయుధం వంటిదే కానీ అది మాత్రమే జీవితం కాదని ప్రతిభ ఉంటే ఎక్కడైనా విజయం సాధించొచ్చ‌ని నిరూపించారు. సామాన్య కుటుంబం నుండి వచ్చి తనకంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును తెచ్చుకోవడమే కాకుండా లక్షలాది మంది అభిమానుల మనసులను గెలవడం చిన్న‌ విషయం కాదు. అవకాశాలు తక్కువగా ఉన్నప్పుడు ప్రతిభను ఎలా ప్రదర్శించాలో ? తన ప్రయాణం ద్వారా చెప్ప‌క‌నే చెప్పారు. ఆ న‌టి ప్రయాణం ఓ విషయాన్ని గుర్తు చేస్తుంది. సమాజం నిర్ణయించిన ప్రమాణాల కంటే వ్యక్తిగత కృషి, నైపుణ్యం అంకితభావం మిన్న. చదువు మధ్యలోనే వదిలేసినా? జీవితంలో పీహెచ్‌డీ చేసినంత అనుభవాన్ని ఆమె సంపాదిం చారు. ఏ రంగంలోనైనా? ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అసాధ్యమైనది లేదని నిరూపించారు.

Tags:    

Similar News