దేవియానీ శర్మ.. బికినీలో హై గ్లామర్ డోస్
నార్త్ నుంచి వచ్చి టాలీవుడ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న యాక్ట్రెస్ దేవియానీ శర్మ ప్రస్తుతం ఓ రేంజ్‌లో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.;
నార్త్ నుంచి వచ్చి టాలీవుడ్‌లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న యాక్ట్రెస్ దేవియానీ శర్మ ప్రస్తుతం ఓ రేంజ్‌లో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఆమె, విశ్రాంతి తీసుకోవాల్సిన టైమ్‌లోనే స్విమ్‌సూట్ షూట్‌తో రీ ఎంట్రీ ఇచ్చింది. పింక్ కలర్ వన్‌పీస్‌లో దేవియానీ పెట్టిన పోజులు నెటిజన్లకు ఒక్కసారిగా షాకివ్వడమే కాదు, గ్లామర్‌కు మరో డెఫినిషన్ ఇచ్చేసినట్టయ్యింది. 'ఎంబ్రేసింగ్ మై ఇన్నర్ హాట్‌నెస్' అంటూ ఇచ్చిన క్యాప్షన్ కూడా యూత్‌కి డైరెక్ట్‌గా కనెక్ట్ అయిపోయింది.
హోటల్ రూమ్‌లో బెడ్ మీద, మిర్రర్ రిఫ్లెక్షన్ దగ్గర, బేగ్ డ్రాప్‌లకు తగ్గట్టుగా గ్లామరస్ లుక్స్‌లో ఆమె పెట్టిన ప్రతి ఫోటో దాదాపు వెయ్యికి పైగా లైక్స్‌ను దక్కించుకుంది. మునుపెన్నడూ లేని విధంగా కాస్త బోల్డ్‌గా, కాన్ఫిడెంట్‌గా కనిపించిన దేవియానీ ఈ లుక్‌తో తన భిన్న కోణాన్ని చూపించగలిగింది. 'బీటీఎస్ సీన్స్ ఫ్రం ది అప్‌కమింగ్ షూట్' అంటూ మరో హింట్ కూడా ఇస్తోంది.. అంటే త్వరలో మరిన్ని అప్‌డేట్స్ రాబోతున్నాయన్నమాట.
దేవియానీ శర్మ వెబ్ సిరీస్ ద్వారా టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. ‘అనగనగా’, ‘సైతాన్’, ‘సేవ్ ది టైగర్స్’ వంటి ప్రాజెక్టుల్లో నటించి నటిగా మంచి మార్కులే కొట్టేసింది. ‘సైతాన్’లో ఆమె చేసిన క్రేజీ యాక్షన్ రోల్.. అలాగే ‘సేవ్ ది టైగర్స్’లో క్యూట్ మోడరన్ వైఫ్ క్యారెక్టర్ నెటిజన్లకు బాగా కనెక్ట్ అయ్యాయి. తాజాగా, ఆమె నటిస్తున్న వెబ్ సిరీస్ టీజర్ కూడా విడుదలైంది. నటనతో పాటు గ్లామర్ విషయంలోనూ దేవియానీ ఓ లెవెల్‌లో ఉంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె యాక్టివ్‌నెస్ కూడా ఓ స్పెషల్ హైలైట్. తన ఫొటోషూట్లు, బోల్డ్ స్టేట్మెంట్స్, లైఫ్ అప్‌డేట్స్ అన్నీ ఓ ప్రొఫెషనల్ మోడల్‌ను తలపించేవిగా ఉంటాయి. ఎటూ అయినా, సినిమాల ద్వారా ఎక్కువగా కనిపించని ఆమె సోషల్ మీడియాలో మాత్రం ఫుల్‌ఫ్లెడ్ హీరోయిన్‌లా ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఇటు సినిమాల్లోనే కాదు, వెబ్ ప్రాజెక్ట్స్, సోషల్ మీడియా బ్రాండ్ డీల్‌లతోనూ కెరీర్‌ని నెమ్మదిగా అప్‌గ్రేడ్ చేస్తోంది.