డీఎస్పీ లా డైరెక్టర్ల గురించి గొప్పగా చెప్పేది ఎంతమంది?
రాక్ స్టార్ దేవి శ్రీ ముక్కు సూటి మనిషి. మనసులో దాపరికాలుండవ్. మనసులో అనుకున్నది బయటకు ఓపెన్ అయిపోతాడు.;
రాక్ స్టార్ దేవి శ్రీ ముక్కు సూటి మనిషి. మనసులో దాపరికాలుండవ్. మనసులో అనుకున్నది బయటకు ఓపెన్ అయిపోతాడు. ఇలాంటి వారు చాలా రేర్ గా ఉంటారు. ఇండస్ట్రీలో ఎవరికీ భజనలు కూడా చేయడు. అవకాశం వస్తే చేస్తా..లేకపోతే లేదు అన్నట్లే ఉంటాడు. అలాగని విమర్శలకు దిగడు. కావాలని అంతకన్నా విమర్శించడు. అందరితో పాటు తనకు అవకాశాలు వస్తే బాగుంటుంది అనుకునే టైప్.
అయితే కొత్త వారి రాకతో దేవికి మునుపటి కంటే అవకాశాలు తగ్గాయి అన్నది వాస్తవం. ప్రముఖంగా ఓ మ్యూజిక్ డైరెక్టర్ వల్ల అవకాశాలు కోల్పోతున్నాడని చాలా కాలంగా ఉంది. కానీ దాని గురించి దేవి ఎప్పుడు ఓపెన్ అవ్వలేదు. ఎలాంటి విమర్శలు కూడా చేయలేదు. అయితే తాజాగా `జూనియర్` అనే సినిమా సాంగ్ లాంచ్ లో దేవి శ్రీ దర్శకుల కష్టాన్ని వెల్లడించే ప్రయత్నం చేసారు. కెప్టెన్ ఆఫ్ ది షిప్ లేకపోతే ఎవరూ లేం అంటూ దర్శకుడి గొప్పతనం చాటి చెప్పాడు.
`నటీనటులను ఎంచుకోవడం..వారందర్నీ ఒకే తాటిపైకి తేవడం.. నిర్మాతను ఒప్పించడం ..టెక్నిషియ న్లను సెట్ చేసుకోవడం నుంచి సినిమా రిలీజ్ వరకూ డైరెక్టర్ ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. అందుకే దర్శకు లందరికీ గౌరవం ఇవ్వాలి. ప్రేమను పంచాలి. చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా డైరెక్టర్ ని గౌరవిం చాలి. సక్సెస్ వస్తే అంతా తీసుకుంటాం. కానీ ఫెయిల్యూర్ వస్తే దర్శకుడినే నిందిస్తారు. కానీ దర్శకుడి కష్టం వల్లే అంతా ఇక్కడ ఉన్నామని గుర్తుంచుకోవాలి.
దర్శకుడి కథ ఒకే అయితేనే ఇంత మంది కి అవకాశం వస్తుంది. అదే కథ సెట్ అవ్వకపోతే అక్కడ ఎవరూ ఉండరు. అందుకు దర్శకుడు రేయింబవళ్లు శ్రమిస్తాడు. డైరెక్టర్ లేకుండా మనమంతా ఎంత ట్యాలెంట్ తో ఉన్నా పీకేదేం లేదు. నా స్టూడియోలో నేను పాటలు కొట్టుకోవాలి. మీ కెమెరాలు మీరే చూసుకోవాలి. అంద మైన కథలు చెబుతూ అందరి జీవితాల్ని అందంగా మారుస్తన్న దర్శకులకు హ్యాట్సాఫ్` అన్నారు. మరి దేవి శ్రీ లా డైరెక్టర్ల కష్టాన్ని గురించే మ్యూజిక్ డైరెక్టర్లు ఎంతమంది ఉన్నారు.