స్టార్ హీరో సినిమాకు బిజినెస్ సమస్యలా..?

కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన చియాన్ విక్రం అక్కడ రికార్డులు సృష్టించే సినిమాలు చేశాడు

Update: 2024-04-29 03:55 GMT

కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన చియాన్ విక్రం అక్కడ రికార్డులు సృష్టించే సినిమాలు చేశాడు. విక్రం సినిమా వస్తుంది అంటే తప్పకుండా బాక్సాఫీస్ పై హంగామా కనిపించేలా సందడి ఉంటుంది. కానీ ఈమధ్య ఆయన సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాలను అందుకోవట్లేదు. కారణాలు ఏవైనా విక్రం కెరీర్ లో వెనకపడ్డాడు అన్నది మాత్రం నిజమని ఒప్పుకోవాల్సిందే. విక్రం సినిమాలు ఈమధ్య తరచు వాయిదా పడుతుండటం కూడా ఈ ఫెయిల్యూర్ కి ఒకానొక కారణమని చెప్పొచ్చు.

ఇదిలా ఉంటే విక్రం పా రంజిత్ కాంబినేషన్ లో తెరకెక్కిన తంగలాన్ సినిమాకు బ్యాడ్ లక్ కొనసాగుతుంది. సినిమా పూర్తైనా కూడా సరైన రిలీజ్ డేట్ దొరక్క రిలీజ్ వాయిదా వేస్తూ వస్తున్నారు మేకర్స్. అసలైతే ఏప్రిల్ లో రిలీజ్ అని మేకర్స్ చెప్పినా ఏప్రిల్ నెల ముగుస్తున్నా కూడా రిలీజ్ అప్డేట్ ఇవ్వట్లేదు. అయితే విక్రం తంగలాన్ రిలీజ్ అవ్వకపోవడం వెనక రీజన్ సినిమా బిజినెస్ జరగకపోవడమే అని కోలీవుడ్ ఇన్నర్ టాక్.

విక్రం సినిమా కాబట్టి అనుకున్న దానికన్నా ఎక్కువ బడ్జెట్ తో సినిమా పూర్తి చేశారట. అయితే వరుస ఫ్లాపుల్లో ఉన్న విక్రం సినిమా భారీగా పెట్టి కొనేందుకు డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు సిద్ధంగా లేరని తెలుస్తుంది. అందుకే సినిమా అనుకున్న బిజినెస్ జరగలేదు కాబట్టే రిలీజ్ ఆపారని చెప్పుకుంటున్నారు.

Read more!

తమిళంలోనే కాదు తెలుగులో కూడా సినిమా రైట్స్ ఎక్కువ చెబుతున్నారని టాక్. అందుకే తంగలాన్ తెలుగు బిజినెస్ డీల్స్ కూడా ఇంకా క్లోజ్ అవ్వలేదని తెలుస్తుంది. తంగలాన్ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ చెప్పిన ప్రైజ్ కి కన్ విన్స్ అవ్వక నిర్మాతలు రిలీజ్ వాయిదా వేస్తూ వస్తున్నారని తెలుస్తుంది. మరి చివరకు ఎవరు తగ్గుతారు ఎవరు ముందడుగు వేస్తారో తెలియదు కానీ విక్రం తంగలాన్ సినిమా రిలీజ్ ఇంకా లేట్ అయితే మాత్రం జరగాల్సిన నష్టం ఇంకా ఎక్కువ అవుతుందని చెప్పొచ్చు.

విక్రం సినిమాలకే ఇలా ఎందుకు జరుగుతుందో తెలియక చియాన్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు. విక్రం మాత్రం ఎప్పటిలానే తన ప్రయోగాలు తాను చేసుకుంతూ వెళ్తున్నాడు. కోలీవుడ్ లో దాదాపు అందరు హీరోలు సూపర్ ఫాం కొనసాగిస్తుండగా విక్రం మాత్రం సరైన హిట్లు లేక గ్రాఫ్ పడిపోయేలా చేసుకున్నాడు. తంగలాన్ తో తిరిగి ఫాం లోకి వస్తాడని అనుకోగా అది కూడా వాయిదాలు పడుతూ సినిమా మీద ఆసక్తి తగ్గిపోయేలా చేస్తుంది.

Tags:    

Similar News