'బ‌న్నీ' కోసం కొబ్బ‌రికాయ ఖ‌ర్చు కూడా పెట్ట‌లేదా?

ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన త‌రువాత నిర్మాత‌గా నాకు బిగ్ బ్రేక్ ఇచ్చిన సినిమాగా 'బ‌న్నీ' నిలిచింది' అని 'బ‌న్నీ 'మూవీ తెర‌వెనుక జ‌రిగిన ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని వెల్ల‌డించారు మ‌ల్లిడి స‌త్య‌నారాయ‌ణ‌.;

Update: 2025-04-15 02:30 GMT

ఒక్క బ్లాక్ బ‌స్ట‌ర్ ఇండ‌స్ట్రీని ఎలా షేక్ చేస్తుందో.., డైరెక్ట‌ర్‌కు ఏ స్థాయి క్రేజ్‌ని తెచ్చిపెడుతుందో 'ఆది' జ‌స్ట్ ఎక్జాంపుల్‌. ఎన్టీఆర్ కు మాస్ హీరో క్రేజ్‌ని తెచ్చిపెట్టిన ఈ సినిమా ద‌ర్శ‌కుడు వీవీవినాయ‌క్‌కు మాత్రం తిరుగులేని గుర్తింపుని తెచ్చిపెట్ట‌డ‌మే కాకుండా ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో ఆయ‌న ఓ హాట్ టాపిక్ అయ్యేలా చేసింది. అంతే కాకుండా ఆయ‌న ఓకే అంటే సినిమా తీయాల‌ని ఇండస్ట్రీలోని హేమా హేమీలంతా క్యూ క‌ట్టి ఎదురు చూశారంటే అతిశ‌యోక్తి కాదు. అంత‌గా ఆయ‌న క్రేజ్‌ని ద‌క్కించుకున్నారు.

'ఆది' త‌రువాత వ‌రుస హిట్‌ల‌తో బిజీగా మారి స్టార్ డైరెక్ట‌ర్ల జాబితాలో చేరిన వినాయ‌క్ ఎంత మంది ప్రొడ్యూస‌ర్లు వెంట‌ప‌డుతున్నా త‌న ఆర‌వ సినిమాని మ‌ల్లిడి స‌త్య‌నారాయ‌ణ‌కే చేస్తాన‌ని మాటిచ్చార‌ట‌. ఇచ్చిన మాట ప్ర‌కారం తాను డైరెక్ట‌ర్ కాక‌ముందు నుంచి త‌న కోసం ఎదురు చూసిన ఆయ‌న‌కే సినిమా ఆఫ‌ర్ ఇచ్చార‌ట‌. దీంతో ఇండ‌స్ట్రీలోని టాప్ ప్రొడ్యూస‌ర్ల దృష్టి నిర్మాత మ‌ల్లిడి స‌త్య‌నారాయ‌ణ‌పై ప‌డింది. అయితే హీరో మాత్రం ఫైన‌ల్ కాలేద‌ట‌.

ఈ విష‌యం తెలిసి ఫైనాన్షియ‌ర్‌లు ఫోన్‌లు చేయ‌డం మొద‌లు పెట్టారు. ఆ స‌మ‌యంలో త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌గారు నాకు స‌పోర్ట్‌గా నిలిచి వినాయ‌క్ డేట్స్ వున్నాయి క‌దా హీరో ఫైన‌లైజ్ కాలేద‌ని తెలిసి వెంక‌టేష్ బాబుతో సినిమా చేస్తారా? అని డి. సురేష్‌బాబు అడ‌గ‌మ‌న్నాడు అని నాతో చెప్పారు. అయితే నేను అదే విష‌యాన్ని వినాయ‌క్‌కు చెబితే లేదు లేదు ఈ క‌థ‌కు యంగ్ హీరో అయితేనే క‌రెక్ట్‌గా ఉంటుంది. వెంక‌టేష్‌కు ఈ క‌థ సెట్ట‌వ‌ద‌న్నాడు. దీంతో యంగ్ హీరో కోసం వెత‌క‌డం మొద‌లు పెట్టాం.

అదే స‌మ‌యంలో నా ద‌గ్గ‌ర వినాయ‌క్ డేట్స్ ఉన్నాయ‌నే విష‌యం తెలుసుకున్న అల్లు అర‌వింద్ నాతో మాట్లాల‌ని రెడీ అయ్యారు. అప్ప‌టికే ఆయ‌న నాకు బాగా క్లోజ్‌. గీతా ఆర్ట్స్ సినిమాలు వైజాగ్‌లో నేనే రిలీజ్ చేశా. అలా అర‌వింద్‌గారు నాకు బాగా క్లోజ్ అయ్యారు. 'ఆర్య‌' త‌రువాత బ‌న్నీ కెరీర్ రీత్యా ఏదైనా యాక్ష‌న్ సినిమా చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. గంగోత్రి ఫ్యామిలీ సినిమా, ఆర్య ల‌వ్ స్టోరీ ఈ సారి యాక్ష‌న్ సినిమా చేద్దాం అనే ప్లాన్‌తో ఉన్నారు. యాక్ష‌న్ సినిమా చేయాలంటే ఇప్పుడున్న డైరెక్ట‌ర్ల‌లో వినాయ‌క్ మొన‌గాడు. వినాయ‌క్‌ని ప‌ట్టుకుంటే బాగుంటుంది అని ఆయ‌న అనుకున్నారు. ఆ స‌మ‌యంలోనే వినాయ‌క్ డేట్స్ నా వ‌ద్ద ఉన్నాయ‌ని ఆయ‌న‌కు తెలిసింది.

వైజాగ్ క్రాంతి పిక్చ‌ర్స్ రెడ్డిగారికి ఫోన్ చేసి ఆయ‌న ద్వారా నాతో మాట్లాడ‌టానికి క‌బురు చేశారు. అక్క‌డే బ‌న్నీతో సినిమా విష‌యం చెప్పారు. అయితే డైరెక్ట‌ర్‌ని అడిగి చెబుతాన‌ని ఆ విష‌యం వినాయ‌క్‌కు చెప్పాను. ఆయ‌న బ‌న్నీ అయితే మ‌రీ బెట‌ర్‌చేసేద్దాం అన్నారు. అలా 'బ‌న్నీ' సినిమా మొద‌లైంది. అయితే ఈ సినిమాకు నేను నిర్మాత‌నే అయినా వ‌న్ ఎన్పీ కూడా పెట్ట‌లేదు. కొబ్బ‌రి కాయ డ‌బ్బులు కూడా నాకు బ‌య‌టి నుంచే వ‌చ్చాయి. అర‌వింద్‌గారు మా అబ్బాయి బ‌న్నీకి రెమ్యున‌రేష‌న్ లేదు. రిలీజ్ త‌రువాత హిట్ అయితే అప్పుడు చూద్దాం అన్నారు. అంతే కాకుండా స‌త్య‌రంగ‌య్య‌గారి ద‌గ్గ‌ర అతి త‌క్కువ వ‌డ్డీకి ఫైనాన్స్ ఆయ‌నే మాట్లాడి పెట్టారు. నాకు 60 శాత‌లం షేర్ ఇచ్చారు. ఆయ‌న 40 శాతం షేర్ తీసుకున్నారు. ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన త‌రువాత నిర్మాత‌గా నాకు బిగ్ బ్రేక్ ఇచ్చిన సినిమాగా 'బ‌న్నీ' నిలిచింది' అని 'బ‌న్నీ 'మూవీ తెర‌వెనుక జ‌రిగిన ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని వెల్ల‌డించారు మ‌ల్లిడి స‌త్య‌నారాయ‌ణ‌.

Tags:    

Similar News