యంగ్ గ్లోబ‌ల్ లీడ‌ర్ గా ఆ హీరోయిన్ !

బాలీవుడ్ హాట్ బ్యూటీ భూమీ ప‌డ్నేక‌ర్ వ‌రుస విజాయాల‌తో దూసుకుపోతున్న సంగ‌త తెలిసిందే

Update: 2024-05-22 15:30 GMT

బాలీవుడ్ హాట్ బ్యూటీ భూమీ ప‌డ్నేక‌ర్ వ‌రుస విజాయాల‌తో దూసుకుపోతున్న సంగ‌త తెలిసిందే. గ‌త ఏడాది అమ్మ‌డు ఏకంగా నాలుగు రిలీజ్ లతో మంచి ఫ‌లితాలే సాధించింది. 'భీద్' ..' అఫ్వా' ..' థాంక్యూ ఫర్ కమింగ్' ..'ది లేడీ కిల్లర్' లాంటి విజ‌యాల‌తో మెప్పించింది. ఇటీవ‌ల రిలీజ్ అయిన క్రైమ్ థ్రిల్లర్ 'భ‌క్ష‌క్' తోనూ మ‌రో విజ‌యం ఖాతాలో వేసుకుంది. లైంగిక వేధింపుల నుండి బాలికలను ర‌క్షించే జ‌ర్న‌లిస్ట్ పాత్ర లో న‌టించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకుంది.

దీంతో భూమీకి అవ‌కాశాల జోరు అంత‌కంత‌కు పెరుగుతుంది. కొత్త ఛాన్సులు క్యూలో ఉన్నా డేట్లు ఇవ్వ‌లేని ప‌రిస్థితి క‌నిపిస్తుంది. స‌రిగ్గా ఇదే స‌మ‌యంలో అమ్మ‌డికి అరుదైన గౌర‌వం కూడా ద‌క్కింది. ప్ర‌పంచ ఆర్దిక వేదిక యంగ్ గ్లోబ‌ల్ లీడ‌ర్ గా కొత్త ఛాన్స్ తీసుకుంటుంది. క్లైమేట్ వారియ‌ర్ అండ్ భూమీ పౌండేష‌న్ ద్వారా ప‌ర్యావ‌ర‌ణానికి చేస్తోన్న విశేష సేవ‌ల‌కు గానూ యంగ్ గ్లోబ‌ల్ లీడ‌ర్ గా భూమీ ప‌డ్నేక‌ర్ ని ఎంపిక చేసిన‌ట్లు వ‌ర్ల‌డ్ ఎక‌నామిక్ ఫోరం ప్ర‌క‌టించింది.

Read more!

రాజ‌కీయాలు, వ్యాపారం, పౌర స‌మాజం, క‌ళ‌లు, విద్యాసంస్థ‌లకు చెందిన కొంద‌రు ప్ర‌ముఖుల పేర్ల‌ను డ‌బ్ల్యూ ఈఎఫ్ ప్ర‌క‌టించింది. దీంతో భూమీ ప‌డ్నేక‌ర్ 2025 లో జ‌రిగే ప్ర‌ఖ్యాత దావోస్ ప్ర‌పంచ ఆర్దిక వేదిక స‌ద‌స్సులో భూమీ భార‌త్ త‌రుపున ప్రాతినిధ్యం వ‌హిస్తూ ప్ర‌స‌గించ‌నుంది. అలాగే ఇదే ఏడాది సింగ‌పూర్ స‌ద‌స్సులోనూ ఆమె ప్ర‌స‌గించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా భూమీ ప‌డ్నేక‌ర్ సంతోషం వ్య‌క్తం చేసింది.

'నా ఎంపిక‌ను ఓ గొప్ప గౌర‌వంగా భావిస్తున్నాను. ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికురాలిగా, న‌టిగా ప్ర‌పంచ వేదిక‌గా నా వాణి బలంగా వినిపిస్తాను' అని అన్నారు. ప్ర‌స్తుతం భూమీ ప‌డ్నేక‌ర్ చాలా సినిమాల‌కు క‌మిట్ అయింది. వాటిలో కొన్ని సెట్స్ కి వెళ్లాయి. మ‌రికొన్ని త్వ‌ర‌లో ప్రారంభం కానున్నాయి.

Tags:    

Similar News