ఏడుసార్లు రిజెక్ట్ చేసినా వెంటాడిన డైరెక్టర్!
అలాగే సల్మాన్ ఖాన్‌తో తనకున్న అనుబంధం గురించి కూడా భాగ్యశ్రీ ఓపెన్ అయ్యారు. షూటింగ్ సమయంలో ఇద్కదరు కాలేజీ స్నేహితుల్లా ఉండేవాళ్లమని గుర్తు చేసుకున్నారు.
భారతీయ చలనచిత్ర చరిత్రలో నిలిచిపోయే ప్రేమకథల్లో `మైనే ప్యార్ కియా` ఒకటి. అప్పట్లో ఈ సినిమా ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ఈ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ గా మారారు భాగ్యశ్రీ. ఈ విజయంతో భాగ్య శ్రీ బాలీవుడ్ లో తిరుగులేని స్టార్ గా కొనసాగారు. అంతటి స్టార్ ఇమేజ్ ఇచ్చిన చిత్రాన్ని భాగ్య శ్రీ నటించడానికి అంగీకరించలేదు అన్న సంగతి ఎంత మందికి తెలుసు. అవును. ఈ విషయాన్ని స్వయంగా భాగ్య శ్రీ రివీల్ చేసారు. ఈ చిత్రంలో సుమన్ పాత్ర కోసం దర్శకుడు సూరజ్ బర్జాత్యా సంప్రదించినప్పుడు తాను మొదట ఆ ఆఫర్‌ను తిరస్కరించానని చెప్పి ఆశ్చర్యపరిచారు.
ఆ సమయంలో భాగ్య శ్రీకి సినిమాలపై పెద్దగా ఆసక్తి లేకపోవడమే అందుకు ప్రధాన కారణమని వెల్లడించారు. అప్పటికే భాగ్యశ్రీ భారత్ లో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి పై చదువుల కోసం విదేశాలకు వెళ్లాలని భావించారట. సినిమాల్లో నటించడం తన కెరీర్ లక్ష్యం కాదని అందుకే ఏడు సార్లు ఆఫర్‌ను కాదన్నట్లు పేర్కొన్నారు. అయితే సూరజ్ బర్జాత్యా పట్టు వదలకుండా భాగ్య శ్రీని ఒప్పించడానికి ప్రయత్నించారు. చివరకు స్క్రిప్ట్ విన్న తర్వాత భాగ్య శ్రీ కథలోని స్వచ్ఛత నచ్చడంతో సినిమా చేయడానికి అంగీకరించారు. ఈ నిర్ణయమే ఆమె జీవితాన్ని మలుపు తిప్పి వెండితెరపై ఐకానిక్ నటిగా నిలబెట్టింది.
అలాగే సల్మాన్ ఖాన్‌తో తనకున్న అనుబంధం గురించి కూడా భాగ్యశ్రీ ఓపెన్ అయ్యారు. షూటింగ్ సమయంలో ఇద్కదరు కాలేజీ స్నేహితుల్లా ఉండేవాళ్లమని గుర్తు చేసుకున్నారు. `మేమిద్దరం చాలా చిన్న వయసులో ఉన్న ప్పుడు ఆ సినిమా చేశాం. సెట్స్‌లో మా మధ్య ఎలాంటి భేషజాలు ఉండేవి కావు. ఒకరినొకరు ఆటపట్టిం చుకుంటూ ఎంతో సరదాగా గడిపేవాళ్లం` అన్నారు. సల్మాన్ అప్పట్లో ఎంతో మొహమాటస్తుడని కానీ స్నేహితులతో మాత్రం చాలా సరదాగా ఉండేవారన్నారు. సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ మధుర స్మృతిని కూడా పంచుకు న్నారు.
ఓ సీన్ చిత్రీకరణలో సల్మాన్ తనను హత్తుకోవాల్సి వచ్చినప్పుడు ఆయన ఎంతో సంకోచించారని ఆ సమయంలో తన భర్త హిమాలయ్ దాసాని కూడా సెట్స్‌లోనే ఉండేవారన్నారు. సల్మాన్ తన వ్యక్తిగత జీవితాన్ని , గౌరవాన్ని ఎంతో మర్యాదపూర్వకంగా చూసేవారన్నారు. అందుకే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ తెరపై అద్భుతంగా పండిందని భాగ్యశ్రీ గుర్తు చేసుకున్నారు. `మైనే ప్యార్ కియా` విడుదలైన తర్వాత వచ్చిన క్రేజ్ గురించి స్పందించారు. దేశవ్యాప్తంగా ప్రతి అబ్బాయికి తనలాంటి అమ్మాయి కావాలని ప్రతి అమ్మాయికి సల్మాన్ లాంటి ప్రేమికుడు కావాలని కోరుకునేలా ఆ సినిమా ప్రభావం చూపిందని అన్నారు.
ఇప్పటికీ తనను చూసిన వారు సుమన్ అని పిలుస్తుంటే కలిగే సంతోషం వర్ణనాతీతమని పేర్కొన్నారు. ఆ సినిమాలో పాటలు , సంభాషణలు దశాబ్దాలు దాటినా ఇంకా ప్రేక్షకుల హృదయాల్లో సజీవంగా ఉండటం విశేషం.భాగ్యశ్రీ కొన్ని సినిమాలకే పరిమితమైనా? ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశారు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే వివాహం చేసుకుని సినిమాలకు దూరమవ్వడం వ్యక్తిగత నిర్ణయమని దానిపై తనకు ఎలాంటి విచారం లేదన్నారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో `రాధే శ్యామ్` చిత్రంతో కంబ్యాక్ అవ్వడం ఎంతో సంతోషాన్నిచ్చిందన్నారు.