బాలయ్య ఉన్నాక మరొకరికి ఎలివేషన్ అంటే..?
ఐతే ఆయన ఈమధ్య ఒక సూపర్ స్టార్ సినిమాలో క్యామియో చేస్తారని టాక్ వచ్చింది. కానీ ఫైనల్ గా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.;
తెర మీద బాలయ్య ఉన్నాడంటే ఆ వైబ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ముఖ్యంగా తొడ కొట్టినా సరే, మీసం మెలేసినా సరే, డైలాగ్ చెప్పినా సరే ఫ్యాన్స్ అంతా ఒక ఫెస్టివల్ గా భావిస్తారు. ఐతే బాలయ్య సినిమాలో ఉన్నప్పుడు మరొకరికి ఎలివేషన్ ఇస్తే ఏమన్నా బాగుంటుందా.. నందమూరి సింహం బాలయ్య వెరైటీ వెరైటీ సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఐతే ఆయన ఈమధ్య ఒక సూపర్ స్టార్ సినిమాలో క్యామియో చేస్తారని టాక్ వచ్చింది. కానీ ఫైనల్ గా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.
లీడ్ స్టార్ ఎలివేషన్ కి బాలకృష్ణ..
ముందు సరదాగా ఒక క్యామియో చేద్దాం అనుకున్నా కూడా అదంతా ఆ సినిమా పమోషన్స్ కి.. ఇంకా ఆ సినిమాలో లీడ్ స్టార్ ఎలివేషన్ కి సపోర్ట్ చేస్తుంది కానీ చేసినందుకు బాలకృష్ణకు ఎలాంటి యూజ్ ఉండదని ఫిక్స్ అయ్యారు. అందుకే ఆ క్యామియో ఆఫర్ ని సున్నితంగానే తిరస్కరించారట. అదీగాక ఈమధ్య బాలయ్య సినిమాల మీద చిన్న కూతురు తేజశ్విని సూపర్ విజన్ జరుగుతుంది.
బాలయ్య అన్ స్టాపబుల్ షో చేయడానికి మెయిన్ రీజన్ కూడా తేజశ్వి అని తెలిసిందే. అన్ స్టాపబుల్ షో తర్వాత బాలయ్య గురించి ఫ్యాన్స్ ఆలోచన మారిపోయింది. ప్రతి ఒక్కరు కూడా బాలకృష్ణలోని ఫన్ సైడ్ చూసి సర్ ప్రైజ్ అయ్యారు. ఇక సినిమాల్లో కూడా బాలయ్య ఎలాంటి రోల్స్ చేస్తే బాగుంటుంది అని డిస్కస్ చేస్తుందట. బాలయ్య చివరి సినిమా డాకు మహరాజ్ సినిమా కథకు మూలం కూడా తేజశ్వి ఇచ్చిన లీడ్ అని తెలుస్తుంది.
అఖండ 2 రిలీజ్ పనుల్లో బిజీ..
మొత్తానికి ఒక సూపర్ స్టార్ సినిమాలో క్యామియోని బాలయ్య కాదనడానికి రీజన్ సినిమాలో ఆయనకు ఎలివేషన్స్ ఉంటాయి కానీ ఆయన మరొకరికి ఎలివేషన్ ఇవ్వడం జరగదనే రీజన్ అని టాక్. రీజన్ ఏదైనా ఒక మంచి కాంబో స్క్రీన్ మీద కనిపిస్తుందని ఆశపడ్డ ఫ్యాన్స్ కి నిరుత్సాహం తప్పదు. బాలయ్య ప్రస్తుతం అఖండ 2 రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని తో సినిమా చేస్తున్నారు. గోపీచంద్ తో పాటు క్రిష్ డైరెక్షన్ లో సినిమాను కూడా బాలయ్య చేస్తున్నాడని తెలిసిందే.
బాలకృష్ణ గోపీచంద్ తో ఈసారి హిస్టారికల్ మూవీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారట. ఆదిత్య 999 సినిమాను కూడా నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లో సెట్స్ మీదకు తీసుకెళ్తారని తెలుస్తుంది. అఖండ 2 సినిమా డిసెంబర్ రిలీజ్ అవ్వడమే ఆలస్యం ఈ రెండు సినిమాల మీద ఫుల్ ఫోకస్ చేయబోతున్నారట బాలకృష్ణ.