చిరు 153 లో కుర్ర హీరో ?

Update: 2019-07-19 04:45 GMT
మొన్న జరిగిన గుణ 369 ట్రైలర్ లాంచ్ లో నిర్మాత అల్లు అరవింద్ త్వరలో బోయపాటి శీను మా బ్యానర్ లో చేయబోతున్నాడన్న వార్త విని అందరూ ఆశ్చర్యపోయారు. అదే వేదికపై హీరో కార్తీకేయను ఉద్దేశించి వెల్కమ్ టు గీత ఆర్ట్స్ అని చెప్పడం మరో షాక్ ఇచ్చింది. సో శీను కార్తికేయ కాంబోలో గీతా సంస్థ సినిమా తీయబోతుందనే టాక్ మొదలైంది. కానీ వాస్తవానికి ఇక్కడో ట్విస్ట్ ఉందట.

దాని ప్రకారం బోయపాటితో అరవింద్ చేస్తానని చెప్పిన సినిమా చిరంజీవితోనట. కొరటాల శివతో చిరు 152  అయ్యాక గీత ఆర్ట్స్ నిర్మించబోయే ప్రాజెక్ట్ కు బోయపాటి ఇంతకు ముందే కమిట్ మెంట్ ఇచ్చాడు. బాలకృష్ణ సినిమా చేశాక ఇటు రావొచ్చు అనుకున్నాడు కానీ అది వాయిదా పడటంతో ప్రస్తుతం స్క్రిప్ట్ చెక్కే పనిలో బిజీగా ఉన్నాడు. అది ఎవరి కోసమో అనే క్లారిటీ అయితే ఇంకా రాలేదు

ఇదిలా ఉంటె మరి కార్తికేయను వెల్కమ్ టు గీత ఆర్ట్స్ అని ఎందుకు చెప్పినట్టు అనే సందేహం కూడా వస్తోంది కదా. ఇన్ సైడ్ టాక్ ప్రకారం అరవింద్ చెప్పింది చిరు సినిమాలో ఓ కీలక పాత్ర కోసమట. ఇంకా చెప్పాలంటే అన్నయ్య సినిమాలో రవితేజ తరహాలో ప్రాధాన్యం ఉంటూనే చిరుతో ఎక్కువ కాంబినేషన్లు ఉండేలా దాన్ని డిజైన్ చేశారట.

దానికి ఇతని నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుగా చెబుతున్నారు. ఇది నిజమా కాదో చెప్పేందుకు అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావాలి. దానికి చాలా టైం ఉంది. అయితే చిరుతో చేస్తే కార్తికేయకు అది మంచి బ్రేకే అవుతుంది. చూడాలి ఎంత వరకు కార్యరూపం దాలుస్తుందో. కార్తికేయ కొత్త సినిమా గుణ 369 వచ్చే నెల 2న విడుదల కాబోతోంది.

    

Tags:    

Similar News