'అలా' చెయ్యమని చెప్పింది 'ఆమెనే'

Update: 2019-02-20 05:45 GMT
ఆ రోజుల్లో అంటే 70 - 80 వ దశకంలో చిన్న పాటి విలన్ గా - స్పెషల్ పాత్రల్లో - కామెడీ పాత్రల్లో నటించి మెప్పించిన నటుల్లో వై విజయ ఒకరు. కొన్ని కొన్ని సినిమాల్లో ఆమె వ్యాంప్ పాత్రలు కూడా చేశారు. అయితే దాదాపుగా చాలా కాలం తర్వాత ఆమె మళ్లీ తనదైన టైమింగ్ తో ఎఫ్-2లో ఆదరకొట్టారు. అన్నపూర్ణమ్మతో కలసి వై విజయ చేసిన పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇదిలా ఉంటే ఎఫ్-2 కి ముందు వై విజయ సినిమాల్లో చాలా కాలం కనిపించలేదు..చాలా గ్యాప్ తర్వాత మళ్లీ కనిపించారు. అయితే అవకాశాలు రాలేదా లేక ఇతరత్రా ఏమైనా కారణాలు ఉన్నాయా అన్న విషయం పక్కన పెడితే - ఆమె ఇప్పుడు బుల్లి తెరపై కూడా కనిపిస్తున్నారు. కొన్ని సీరియల్స్ లో బిజీగా ఉన్నారు.

ఇక తాజాగా ఆమె ఒకానొక ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్‌ వ్యూ లో చాలా మందికి తెలియని కొన్ని విషయాలను అందరితో పంచుకున్నారు. అదేంటి అంటే ఆమె ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికి - అదే క్రమంలో ఈరోజు ఆనందంగా ఉండడానికి అసలు కారణం ఎవరు అంటే హీరోయిన్ విజయశాంతి అని తెలిపారు. అదేంటి అంటే - ఆ రోజుల్లో డబ్బుని కాపాడుకోమని - ఆస్తులు కొనుక్కోమని - అలా చేస్తే రిటైర్ అయ్యాకా ఇబ్బంది ఉండదు అని విజయ్ శాంతి సలహా ఇచ్చింది అని, ఇక ఆమె ఇచ్చిన సలహా మేరకే... కష్టపడి - వచ్చిన ప్రతీ రూపాయితో చెనై మహానగరంలో నేను నా భర్త ఇద్దరం కమర్షియల్ కాంప్లెక్స్ లను ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు వాటి నుంచే బోలెడు అద్దె వస్తుంది. ఆ అద్దె మాకు ఈ టైమ్ లో బాగా ఉపయోగ పడుతుంది అని ఆమె తెలిపారు.

అయితే ఇదే మాటని ఒకసారి నటుడు  చంద్రమోహన్ - మురళీ మోహన్ సైతం ఇలానే ఇండస్ట్రీలో కొందరు తమకు సలహా ఇవ్వడంతో ఆస్తులు కూడ బెట్టుకుని - ఇప్పుడు సంతోషంగా ఉంటున్నాం అని తెలిపిన సంధర్భాలు చాలానే ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే మన ఇండస్ట్రీలో మహానటి సావిత్ర లాంటి కధలే కాదు...ఇదిగో ఇలా కొందరి సలహాలతో సంతోషంగా జీవించే కధలు చాలానే ఉన్నాయన్న మాట. ఏది ఏమైనా...ఈ విషయంలో అలనాటి తార విజయశాంతిని మెచ్చుకుని తీరాల్సిందే.
Tags:    

Similar News