ర‌జ‌నీ కోసం మెగాస్టార్ రాన‌న్నారా?

Update: 2019-11-07 11:47 GMT
సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ న‌టించిన ద‌ర్బార్ 2020 సంక్రాంతి కానుక‌గా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ్- తెలుగు- హిందీ - మ‌ల‌యాళంలో అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ్ కానుంది. అందుకు త‌గ్గ‌ట్టే ఈ సినిమాకి ప్ర‌చారం ఆ స్థాయిలోనే ప్లాన్ చేసింది లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌.

ద‌ర్బార్ త‌మిళ వెర్ష‌న్ కోసం ర‌జ‌నీ - క‌మ‌ల్ హాస‌న్ నేరుగా బ‌రిలో దిగారు. నేటి సాయంత్రం మోష‌న్ పోస్ట‌ర్ రిలీజ్ తో ఆ ఇద్ద‌రూ హీటెక్కించ‌బోతున్నారు. అలాగే హిందీ వెర్ష‌న్ కోసం కండల హీరో స‌ల్మాన్ ఖాన్ ని బ‌రిలో దించారు. మ‌రోవైపు మ‌ల‌యాళ వెర్ష‌న్ కోసం మోహ‌న్ లాల్ లాంటి సూప‌ర్ స్టార్ ని ప్ర‌చారానికి ఉప‌యోగిస్తున్నారు. అయితే ర‌జ‌నీ కోసం బ‌రిలో దిగిన వీళ్లంతా సీనియ‌ర్లే. వీళ్లంద‌రితో ర‌జ‌నీకి స‌త్సంబంధాలున్నాయి.

అయితే తెలుగు వెర్ష‌న్ వ‌ర‌కూ ద‌ర్బార్ ప్ర‌చారానికి యంగ్ సూప‌ర్ స్టార్ మ‌హేష్ ని సంప్ర‌దించ‌డం ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తావిచ్చింది. అన్నిచోట్లా సీనియ‌ర్ హీరోలు ప్ర‌చారం చేస్తుంటే ఇక్క‌డే ఎందుకిలా మ‌హేష్ వైపు మొగ్గు చూపారు?  ఇక్క‌డ మెగాస్టార్ చిరంజీవిని ర‌జ‌నీ ఆహ్వానిస్తే కాద‌న‌డు. సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ కి చిరు అత్యంత స‌న్నిహితుడు. త‌న‌ ఆప్త మిత్రుడు అయిన చిరుని కాద‌ని మ‌హేష్ వెంటే ఎందుకు ప‌డ్డారు? అంటూ ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. పైగా ఏ.ఆర్.మురుగ‌దాస్ తో `స్పైడ‌ర్` డిజాస్ట‌ర్ నేప‌థ్యంలో మ‌హేష్ తో విభేధాలొచ్చాయ‌ని అప్పట్లో ప్ర‌చార‌మైంది. మ‌రి ఇన్ని నెగెటివ్ అంశాలు ఉండీ మ‌హేష్ తోనే నేటి సాయంత్రం ద‌ర్బార్ మోష‌న్ పోస్ట‌ర్ లాంచ్ చేయించ‌డ‌మేమిటి?  చిరు అందుబాటులో లేరా.. మ‌హేష్ తోనే స‌రిపోతుంద‌నుకున్నారా? అస‌లు ఇందులో లాజిక్ ఏమిటో! అంటూ ఫ్యాన్స్ బుర్రలు బాదుకుంటున్నారు. మ‌రి వీటికి ర‌జ‌నీయే తెలుగు వెర్ష‌న్ ప్ర‌మోష‌న్స్ లో స‌మాధానం చెబుతారేమో! ఇంత‌కీ తెలుగు మీడియాతో ర‌జ‌నీ-మురుగ‌దాస్ ఇంట‌రాక్ష‌న్స్ ప్లాన్ ఉందో లేదో చూడాలి!!
Tags:    

Similar News