జేబీ బిజీనా.. ఇంకేదైనా రీజన్ ఉందా?

Update: 2019-05-20 08:05 GMT
సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం 'మహర్షి'కి రిలీజ్ తర్వాత కూడా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఒకవైపు సినిమాకు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చినప్పటికీ దాంతో సంబంధం లేకుండా 'మహర్షి' ఈ సినిమాను బ్లాక్ బస్టర్ గా మలిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. సమ్మర్ సీజన్ ను ఫుల్ గా వాడుకునేందుకు ప్రమోషన్ కార్యక్రమాలలో మహేష్ స్వయంగా పాల్గొంటూ సినిమాకు బజ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

రీసెంట్ గా విజయవాడలో 'మహర్షి' విజయోత్సవం జరిగిన సంగతి తెలిసిందే. ఈ భారీస్థాయిలో జరిగిన ఈ కార్యక్రమానికి 'మహర్షి' టీమ్ అంతా హాజరయ్యారు. కానీ ఈ సినిమాలో మెయిన్ విలన్ గా నటించిన జగపతి బాబు మాత్రం ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం ఓ హట్ టాపిక్ అయింది.  విజయవాడలో జరిగిన సక్సెస్ మీట్ మాత్రమే కాదు.  'మహర్షి' కి సంబంధించిన ఇతర ప్రమోషన్స్ లో కూడా జేబీ కనపడకపోవడం గమనార్హం.  అయితే  జగపతి బాబు 'శ్రీమంతుడు' సమయంలో అన్ని ప్రమోషన్స్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.  

దీంతో జగపతి బాబు ఎందుకు హాజరు కావడం లేదని చర్చ జరుగుతోంది.  కొందరేమో జగపతిబాబు షెడ్యూల్ ప్రస్తుతం ఊపిరిసలపకుండా ఉందని.. ఆయన పలు క్రేజీ ప్రాజెక్టులలో నటిస్తూ ఉండడంతో 'మహర్షి' ప్రమోషన్స్ లో పాల్గొనేందుకు సమయం చిక్కడం లేదని అంటున్నారు. నిజమే అయి ఉండొచ్చు కానీ అన్నీ ప్రమోషన్ కార్యక్రమాలకు దూరంగా ఉండడం మాత్రం అలోచించాల్సిన విషయమేనని మరికొందరి అభిప్రాయం.  ఈ విషయంపై జగపతిబాబు మాట్లాడితే కానీ క్లారిటీ రాదు.


Tags:    

Similar News