కేటీ ముందే జాకీ సెగ‌లేమిటి?

Update: 2019-11-13 10:40 GMT
ఇంట‌ర్నేష‌న‌ల్ స్టార్.. గాయ‌ని కేటి పెర్రీ ముంబైలో లైవ్ కాన్సెర్ట్ కోసం అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ పూల‌రంగ‌డు క‌ర‌ణ్ జోహార్ కేటీ కోసం ప్ర‌త్యేకించి అదిరిపోయే పార్టీని ఎరేంజ్ చేశాడు. ఇక ముంబై మీడియాతో కేటి పెర్రీ ఇంట‌రాక్ష‌న్స్ వ‌గైరా ఇప్ప‌టికే వైర‌ల్ గా మారాయి.

ఈనెల‌ 16న ముంబైలో నిర్వహించే లైవ్ కాన్సర్ట్ కంటే ముందే బాలీవుడ్ స్టార్ల‌తో కేటీ స్నేహం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో కేటి పెర్రీ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తో కలిసి మీడియా మీట్ లో సంద‌డి చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక కేటీ ఓ ఆస‌క్తిక‌ర సంగ‌తిని సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించింది. కండ‌ల హీరో స‌ల్మాన్ ఖాన్- అందాల జాక్విలిన్ జంట‌గా న‌టించిన కిక్ చిత్రం చూడాల‌నుంద‌ని చెప్పి షాకిచ్చింది. డే వ‌న్ సాయంత్రమే 'కిక్' మూవీ చూసేందుకు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఇంటికి వెళ్తున్నట్లు కేటి పెర్రీ తెలిపింది.

అదంతా ఒకెత్తు అనుకుంటే నిన్న‌టి ప్రెస్ మీట్లో ఇంట‌ర్నేష‌న‌ల్ స్టార్ కేటీనే డామినేట్ చేస్తూ జాకీ ఇచ్చిన ట్రీట్ సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ అమ్మ‌డు పొట్టి మిడ్డీలో కుర్ర‌కారుకు కంటికి కునుకు ప‌ట్ట‌నివ్వ‌ని ట్రీటిచ్చింది. అంతేనా.. ఈ సంద‌ర్భంగా మీడియా ఫోటోషూట్లో ర‌క‌ర‌కాల భంగిమ‌ల్లో జాకీ సెగ‌లు హాట్ టాపిక్ గా మారాయి. అంత పెద్ద స్టార్ ముందే జాకీ సెగ‌లేమిటో! అంటూ వాడి వేడిగా ముచ్చ‌టించుకున్నారంతా. వాటిలోంచి చ‌మ‌క్కులాంటి ఫోటోలు సామాజిక మాధ్య‌మాల్లో అటూ ఇటూ షికార్లు చేస్తున్నాయి.
Tags:    

Similar News